అబ్బో... ఆ సినిమాలో ఎన్నెన్ని ముద్దులో!
సినిమా చరిత్రలోనే అత్యధిక ముద్దులున్న చిత్రం ఏది? అని అడిగితే, ఏదో కొత్త చిత్రమేమో అనుకోవచ్చు చాలా మంది. కానీ ఆ ఘనత దక్కించుకున్నది ఎప్పుడో 92 ఏళ్ల నాటి సినిమా అంటే నమ్మగలరా? అదే ‘డాన్‌ జువాన్‌’. 1926 ఆగస్టు 6న విడుదలైన ఈ సినిమాలో నేపథ్య సంగీతం ఉంటుంది కానీ మాటలుండవు. ఇందులో హీరో పాత్ర పోషించిన జాన్‌ బేరీమోర్‌ నిశ్శబ్ద చిత్రాల కాలంలో అందాల తారలుగా పేరొందిన మేరీ ఆస్టర్‌, ఎస్టెలీ టైలర్‌లను 191 సార్లు ముద్దు పెట్టుకుంటాడు. అలాన్‌ క్రాస్‌లాండ్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా అప్పట్లో ఓ సంచలనం.



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.