తారక్, బన్నీ వద్దన్నారు.. సిద్దార్థ్‌ ఓకే అన్నాడు

టాలీవుడ్‌లో ఇప్పటి వరకు ఎన్ని చిత్రాలొచ్చినా.. భవిష్యత్తులో అంతకుమించి రాబోతున్నా.. కొన్ని సినిమాలు మాత్రం చిరస్థాయిగా నిలుస్తాయి. కథ, కథనం, సంగీతం, తారాగణం.. ఇందుకు సహకరిస్తాయి. ఇవన్నీ సమపాళ్లలో ఉంటే ఎలాంటి విజయం అందుకోవచ్చో నిరూపించిన సినిమా ‘బొమ్మరిల్లు’. మాస్‌ ప్రేక్షకులు, క్లాస్‌ ప్రేక్షకులని వర్గ భేదం లేకుండా అన్ని వర్గాల వారిని అలరించింది. హాసినిగా కథానాయిక జెనీలియా చేసిన అల్లరి మరిచిపోలేనిది. తండ్రి కోసం తన ఇష్టాలను చంపుకుని తనలో తనే బాధపడే యువకుడుగా సిద్దార్థ్‌ జీవించాడనడం అతిశయోక్తి కాదేమో అంతలా ప్రతి కుర్రాడ్ని ఆకట్టుకుంది ఆ పాత్ర. సిద్దార్థ్‌ సినీ కెరీర్‌కే పేరు తీసుకొచ్చింది. ఇంతటి ప్రాధాన్యమున్న పాత్రను జూనియర్‌ ఎన్టీఆర్, అల్లు అర్జున్‌ చేస్తే ఎలా ఉండేదో కదా. ఎందుకంటే? ఈ సినిమా కోసం కథానాయకుడి పాత్రకు జూనియర్‌ ఎన్టీఆర్, అల్లు అర్జున్‌ను సంప్రదించిందట చిత్ర బృందం. అదే సమయంలో ఈ ఇద్దరూ వేరే ప్రాజెక్టులతో బిజీగా ఉండటంతో ఈ కథ సిద్దార్థ్‌ దగ్గరకు వెళ్లింది. కథ విన్న వెంటనే ఓకే చెప్పాడట సిద్దార్థ్‌.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.