దైవభక్తి అందుకే: కోడి రామకృష్ణ

దర్శకుడు కోడి రామకృష్ణకి నమ్మకాలు ఎక్కువని తెలిసిందే. ఆయనకు దైవభక్తి కూడా ఎక్కువే. అందుకు బీజం వేసింది ఆయన చిన్నతనంలోని ఓ సంఘటన. ఆ సంఘటన గురించి కోడి రామకృష్ణ ఓ సందర్భంలో చెప్పారు. ‘‘రోజూ తెల్లవారు ఝూమునే స్నానం చేయించేందుకు అమ్మ కాలువకు తీసుకెళ్లేది. ఎప్పటిలాగే కాలువలో స్నానం చేసి గట్టు మీద అటూ ఇటూ తిరుగుతున్నాను. అమ్మ కూడా అక్కడే బట్టలు ఉతుక్కొంటోంది. ఇంతలో నేను కాలుజారి కాలువలో పడిపోయాను. నేను పడిన విషయం గమనించిన ఓ వ్యక్తి వెంటనే కాలువలో దూకి నన్ను బైటకు తీసి ప్రాణాలు కాపాడారు. అప్పుడు అమ్మ నన్ను హత్తుకొని భోరున ఏడ్చి నన్ను బాగా కొట్టింది. వెంటనే గుడికి తీసుకెళ్లి పూజ చేయించింది. ఇప్పటి నుంచి దేవుడిని నమ్ముకో అని చెప్పింది. నువ్వు బాగుండాలి నేను నీకు పుట్టాలి అని చెప్పింది. అప్పటి నుంచే అమ్మ మాటలే ఫాలో అవుతున్నాను’’ అంటూ చెప్పారు కోడి రామకృష్ణ.



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.