పడవ పాట చమత్కారం

ప్ర
సిద్దిగాయకుడు ఎమ్‌.ఎస్‌.రామారావు తొలిసారిగా ‘తాశీల్దార్‌’లో పాడాడు. పడవ నడుపుకుంటూ పాడతాడుగాని పెదవుల కదలిక ఉండదు. వెనకాల వినిపిస్తుంది. అయితే, అంతకుముందే, 1941లో ‘దేవత’లో రేడియోలో ఆయన కంఠం వినిపిస్తుంది - పద్యంగా. తరువాత పాడినా, చివరగా ఆయన పాడిన పాట ‘చినికిన చినుకెల్ల మంచి ముత్యము కాదు’ ఇది మల్లాది రామకృష్ణ శాస్త్రి రచన, సంగీతం అశ్వత్థామ. ‘తాశీల్దార్‌’లోని పాట - ఎంకి పాట. ‘‘ఈ రేయి నన్నొల్లవా’’ అన్నది. నండూరు సుబ్బరావు రచన, హెచ్‌.ఆర్‌.పద్మనాభ శాస్త్రి సంగీతం. తనకు సినిమాల్లో అవకాశాలు తగ్గిపోయాయని, హైదరాబాద్‌ మకాం మార్చారు మద్రాసు నుంచి. ఆయన చమత్కరించేవారు. ‘నా తొలి పాట, పడవపాట. చివరి పాట కూడా పడవపాటే. ‘చివరకు మిగిలేది’ (1960)లో పడవలో వచ్చే పాటే’’ అని చెప్పేవారు.

- రావి కొండలరావు


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.