బాండ్‌ సెల్ఫీ కష్టాలు

భిమాన తారలను ఆటోగ్రాఫ్‌లు అడిగే రోజులు కావివి. ఇప్పుడంతా సెల్ఫీల మీదే మోజు. అభిమాన నటులు కనిపిస్తే చాలు సెల్ఫీల కోసం ఎగబడిపోతున్నారు. కొన్ని సార్లు ఈ విషయంలో అభిమానుల అత్యుత్సాహం తారలను ఇబ్బంది పెడుతున్న సంగతి తెలిసిందే. అన్నట్లు జేమ్స్‌ బాండ్‌కూ ఈ పరిస్థితి తప్పడం లేదట. బాండ్‌ పాత్రతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న డేనియల్‌ క్రేగ్‌ సెల్ఫీ కష్టాల గురించి ఏకరువు పెట్టాడు. ‘‘నాకు రాత్రి పూట సరదాగా పబ్బుకు వెళ్లడం అలవాటు. అక్కడ సన్నిహితులతో ప్రశాంతంగా గడపాలనుకుంటాను. కానీ అభిమానులు సెల్ఫీల కోసం చుట్టుముడుతుంటారు. సెల్‌ఫోన్లు రావడం వల్లే పరిస్థితి ఇలా తయారయింది. పగలంతా ఆటోగ్రాఫ్‌లు ఇవ్వడానికి, ఫొటోల కోసం పోజులివ్వడానికి నాకు అభ్యంతరం లేదు. కానీ రాత్రి కూడా సెల్ఫీల కోసం అడుగుతుంటే నరకంలా అనిపిస్తుంద’’న్నారు క్రేగ్‌. ఇక అనుమతి లేకుండా తారలను ఫొటోలు తీసేవారూ ఉన్నారు. దాని గురించి ఆయన మాట్లాడుతూ ‘‘నేను ఓ మామూలు మనిషిలా బతకలేకపోతున్నాను. అందుకు కారణం ఇప్పుడు ప్రతి ఒక్కరి దగ్గరా కెమెరా ఉండటమే’’ అని చెప్పారు.© Sitara 2018.
Powered by WinRace Technologies.