ట్రాఫిక్‌ బోర్డుకు కూడా సెన్సార్‌ కట్‌

1954లో ‘నిరుపేదలు’ అనే సినిమా వచ్చింది. ప్రత్యగాత్మ రాసిన కథతో తాతినేని ప్రకాశరావు డైరెక్టు చేశారు. నిజానికి చాలా మంచి సినిమా. కేవలం నిరుపేదల జీవితాల్ని తీసుకొని వాస్తవికంగా చిత్రించారు. అక్కినేని నాగేశ్వరరావు (రిక్షావాడు), జమున పాత్రధారులు. బాక్స్‌ ఆఫీసు హంగుల కోసం, డాన్సులు, ఫైట్లు, హాస్యం లాంటి వేవీ పెట్టకుండా, లక్షణమైన సినిమాగా రూపొందించారు. (నేను రెండుసార్లు చూశాను) అయితే పేదల జీవితాలతో ధనవంతులు ఎలా ఆడుకుంటారో చెప్పే సినిమా అని, ఇది కమ్యూనిస్టుల సినిమా అని సెన్సారువారు ముద్ర కొట్టారు. వెయ్యి అడుగులకు పైగా చిత్రాన్ని కత్తిరించారు. ఇంకా విచిత్రం ఏమిటంటే, ఒక చోట ట్రాఫిక్‌ సిగ్నల్‌గా ఉన్న ‘కీప్‌ లెఫ్ట్‌’ అన్న బోర్డును కూడా సెన్సార్‌ కత్తిరించింది. ఎందుకంటే అది వామపక్షాల్ని బలపరుస్తున్నట్లుందని - సమాధానం ఇచ్చారు.

- రావి కొండలరావు


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.