గ్రహాంతర వాసి కోట్లు సంపాదించాడట!


మీర్‌ ఖాన్, అనుష్క శర్మ జంటగా 2014లో వచ్చిన చిత్రం ‘పీకే’. ఇందులో అమీర్‌ విచిత్రంగా ప్రవర్తించి అందరిని మనసులు దోచుకున్న విషయం తెలిసిందే. గ్రహాంతరవాసిగా కనిపించి ఆశ్చర్యపరిచాడు. సినిమా అంటే పాటలు, ఫైట్లు మాత్రమే అని భావించే వారిలో దర్శకుడు హిరానీ ‘పీకే’ చిత్రంతో ఓ మార్పు తీసుకొచ్చాడని చెప్పొచ్చు. ప్రేక్షకులు ఎంతగా ఆదరించారో.. అంతకన్నా ఎక్కువగా కలెక్షన్లు సాధించింది. అప్పటి వరకు ఉన్న బాలీవుడ్‌ చిత్రాల రికార్డులను తిరగరాసింది. అంతేకాదు భారత్‌లో రూ.300 కోట్లు, ప్రపంచ వ్యాప్తంగా రూ.700 కోట్లు వసూళ్లు చేసిన తొలి బాలీవుడ్‌ సినిమాగా నిలిచింది.




Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.