అక్కినేనికి నందమూరి ఆకాంక్షలు!

అక్కినేని నాగేశ్వరరావు 1975లో అమెరికా వెళ్లి తన గుండె చూపించుకుంటే ‘బైపాస్‌ సర్జరీ చేసుకుంటే, కొన్నేళ్ళపాటు చిత్రాల్లో నటించవచ్చు’ అన్నారు డాక్టర్లు. (అప్పటికి మనదేశానికి బైపాస్‌ రాలేదుట) ‘‘చేసుకుంటాను’’ అని, చేసుకున్న తర్వాత విజయవంతంగా తిరిగి వచ్చిన సందర్భంలో తాజ్‌ కోరమండల్‌ (మద్రాసు) హోటల్‌లో పెద్ద అభినందనసభ - జరిగింది. దర్శక నిర్మాతల సంఘాలు తలపెట్టాయి. ఆ సభకి ఎన్‌.టి.రామారావు అధ్యక్షత వహించారు. (నేను ఆ సభకి వెళ్లాను) అక్కినేని ‘బైపాస్‌’ ఎలా చేస్తారు? ఎలా జరిగింది? అన్ని విషయాలు సుధీర్ఘంగా ప్రసగించారు. రామారావు చాలా ఆత్మీయంగా మాట్లాడారు. ‘‘బ్రదర్‌ పూర్తి ఆరోగ్యంతో తిరగి రావడం చాలా ఆనందం. మన చిత్ర పరిశ్రమకి నాగేశ్వరరావు అవసరం ఎంతో ఉంది. ఆయన నిండునూరేళ్లు ఆరోగ్యంగా జీవించాలి. ఎన్నో చిత్రాల్లో నటించి ఆదర్శప్రాయంగా నిలవాలనీ ఆకాంక్షిస్తున్నాను’’ అని చెప్పి అక్కినేని వారిని ఆనందబాష్పాలతో ఆలింగనం చేసుకున్నప్పుడు సభ చప్పట్లతో మోగిపోయింది.

- రావి కొండలరావు


© Sitara 2018.
Powered by WinRace Technologies.