పుల్లయ్యకు విగ్గు కథ

దర్శక నిర్మాత పి.పుల్లయ్య 1972లో కాబోలు, రష్యా పర్యటించారు. పర్యటనలో స్టూడియోలు చూశారు. మనిషిని పోలిన మనిషి మాస్కులు అద్భుతంగా తయారు చెయ్యడం చూసి విస్తుపోయారు. తన బట్టతలకి మంచివిగ్గు నిత్యం ధరించే లాంటిది చెయ్యగలరా? అని అడిగితే ఒక్కగంటలో ఇస్తాను అని తలకొలతలు తీసుకుని విగ్‌ మేకింగ్‌ తయారుచేసి ఇచ్చిందిట. ఆ నల్లటి విగ్గులో ఆయన యవ్వనవంతుడిలా వున్నారు! విగ్గు తెచ్చుకున్నారు కాని, ధరించలేరు. ఏం? ‘‘ఈ ముసలాడికి ఈ వయసులో ఏం పోయేకాలం?.. అని తలమీద ఉన్న నాలుగు వెంట్రుకలూ పీకేస్తారేమో అని’’... అని చెప్పారు పుల్లయ్య.

- రావి కొండలరావు


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.