భైరవకు ‘‘దండాలయ్యా’’ అలా దక్కిందట

సినిమాలు ఉన్నన్నాళ్లు ‘బాహుబలి’ పేరు ఎలా చిరస్థాయిగా నిలుస్తుందో.. అందులోని ‘‘దండాలయ్యా దండాలయ్యా’’ పాట కూడా అంతే అనడంలో అతిశయోక్తి లేదు. సినిమాకే హైలెట్‌గా నిలిచే పాట ఇది. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా అన్ని వయసుల వారూ ఇప్పటికీ ఏదో ఓ సందర్భంలో ఈ పాట హమ్‌ చేస్తునే ఉంటారు. అంతగా విశేషాదరణ పొందడానికి గాయకుడు కాలభైరవ ప్రధాన కారణం. ఆయన గాత్రం ఆ పాటకు ప్రాణం పోసింది. అప్పటి నుంచి కాల భైరవ ఏ పాట పాడినా అది హిట్టే. అయితే ముందుగా ఈ పాట వేరే గాయకుడుతో పాడించాలనుకున్నారట సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి. ట్యూన్‌ ప్రాక్టీస్‌ చేసే సమయంలో భైరవ ప్రతిరోజూ అక్కడే ఉండటంతో ఆయనకు కంఠతా వచ్చేసిందట. చిన్నప్పటి నుంచి ఉన్న పాడాలనే తన కోరికను కీరవాణి దగ్గర పనిచేసే కీబోర్టు ప్లేయర్‌కు చెప్పగా .. ‘నాన్న పాడేశారు కదా’ అని బదులిచ్చాడట. అయినా వినకుండా ఓ రోజు పాట పాడి రికార్డు చేసి థియేటర్‌లో ఉంచితే, కీరవాణి విని గాత్రం బావుంది. ఎవరు పాడారు? అని ఈ కీబోర్డు ప్లేయర్‌ని అడగ్గా ‘భైరవ’ పాడాడని చెప్పాడు. అలా చివరగా భైరతోనే ‘దండాలయ్యా’ ట్రాక్‌ పాడించారు కీరవాణి.






Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.