పుల్లయ్య ప్రేమ కథ

పి.పుల్లయ్య తొలిచిత్రం - ‘సారంగధర’ దర్శకుడిగా 1937లో వచ్చింది. అంతకుముందు పుల్లయ్య ‘హరిశ్చంద్ర’ సినిమాకి దర్శకత్వ సహకారం అందించారు, దర్శకుడు టి.వి.రామన్‌. ఇది 1935లో వచ్చింది. ‘సారంగధర’లో అద్దంకి, బందా, శాంతకుమారి ముఖ్యనటులు. పుల్లయ్య యువకుడు. కష్టపడి పని చేస్తున్నాడు. చిత్రాంగి వేసిన శాంతకుమారిని ప్రేమగా పిలుస్తున్నాడు. అలా ఆయన్ని చూసిన శాంతకుమారి, పుల్లయ్యని ప్రేమించి, తన మనసులోని మాటచెప్తే ఆయన కూడా సమ్మతించగా ఇద్దరూ వివాహం చేసుకున్నారు.

- రావి కొండలరావు


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.