చెర్రీని చంపడం ఇష్టంలేకే ‘సైరా’ వద్దన్నారట!
చరిత్ర గురించి చెప్పాలంటే క్రీస్తు ముందు.. క్రీస్తు తర్వాత. అదే ఓ సినిమా గురించి అడిగితే? ఇంటర్వెల్‌ ముందు ఇంటర్వెల్‌ తర్వాత అనాల్సిందే. అందుకే ఇంటర్వెల్‌ సన్నివేశాల్ని పకడ్భందీగా ప్లాన్‌ చేస్తుంటారు దర్శక, నిర్మాతలు. ఇది అన్ని చిత్రాలకూ వర్తించినా.. స్టార్‌ కథానాయకుల సినిమాలకు మాత్రం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటారు. అగ్ర కథానాయకుడు చిరంజీవి నటించిన ‘సైరా’ చిత్రం విషయంలో అలాంటిదే జరిగింది. ఇందులో ‘నరసింహారెడ్డి, నీ లాంటివాడు దేశానికి కావాలంటూ చిరు చేతిలోని కత్తి తీసుకుని పొడుచుకుని చనిపోయే షేర్‌ఖాన్‌ పాత్ర కీలకమైంది. అంతటి ప్రాముఖ్యం ఉన్న ఈ పాత్ర కోసం చిత్ర బృందం ముందుగా బాలీవుడ్‌ స్టార్స్‌ సల్మాన్‌ఖాన్‌, సంజయ్‌ దత్‌లలో ఎవరినో ఒకర్ని ఎంపిక చేసుకుందామనుకుంది. కానీ పలు కారణాల వల్ల వాళ్లు ఈ ప్రాజెక్టును వదులుకున్నారు. దీంతో ఆ పాత్రను రామ్‌ చరణ్‌ పోషిస్తే బావుంటుందనే అభిప్రాయానికొచ్చారు దర్శకుడు. తండ్రి కారణంగా తనయుడు చనిపోయే సన్నివేశం ప్రేక్షకులు అంగీకరిస్తారో లేదో అనే సందేహంతో చరణ్‌ నటించడాన్ని వద్దన్నారు చిరు. ఇదిలా ఉంటే ఇలాంటి చారిత్రాత్మక నేపథ్యంలో తెరకెక్కే చిత్రాలకు నిడివి ఎక్కువ ఉంటుందనే విషయం తెలిసిందే. అలా స్క్రిప్ట్‌ దశలోనే ఆ నిడివిని తగ్గించే ప్రయత్నంలో ఆ పాత్రను తొలగించిందట చిత్ర బృందం. అలా ‘సైరా’ చిత్రంలో నటించే అవకాశం మిస్ అయ్యాడు చెర్రీ.



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.