కమల్‌ హాసన్‌గా రాశి కనిపించిన చిత్రమిదే

కమల్‌ హాసన్‌గా రాశి కనిపించడమంటే కమల్‌లా మారిపోవడం కాదండోయ్‌. ఆమె తన కెరీర్‌ కథానాయికగా ప్రారంభించకముందే బాలనటిగా తెరంగ్రేటం చేసిన విషయం తెలిసిందే. అలా ఓ హిందీ చిత్రంలో కమల్‌ హాసన్‌ చిన్ననాటి పాత్రలో నటించింది రాశి. అదే సినిమా అంటే? బాలీవుడ్‌ అగ్ర కథానాయకుడు అమితాబ్‌ బచ్చన్, తమిళ ప్రముఖ కథానాయకులు కమల్‌ హాసన్, రజనీ కాంత్‌తో తెరకెక్కిన ‘గిరఫ్తార్‌’. ఇదే ఆమెకు తొలి సినిమా. తండ్రి చనిపోయిన సమయంలో తల్లిని పట్టుకుని ఉండే సన్నివేశం అది. చిన్న వయసు కావడంతో కెమెరా ముందు ఎలా ఉండాలో కూడా తెలుసుండదు కదా. దీంతో చుట్టూ ఉన్న వారిని చూసి కంటతడి పెట్టుకుందట. తల్లి పాత్రలో నటిస్తున్న వ్యక్తి ఎత్తుకుంటే అమ్మ కావాలంటూ ఏడ్చేసిందట. ఎంత చెప్పినా ఏడుపు ఆపకపోవడంతో ఆమె తల్లినే ఈ పాత్ర పోషించారు. ‘అలా మా అమ్మ కూడా సినిమాలో నటించిద’ని ఓ సందర్భంలో చెప్పుకొచ్చింది అందాల రాశి.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.