తొలి బయోపిక్‌ అదే

ఇప్పుడంటే బయోపిక్‌ల పేరుతో సావిత్రి, ఎన్‌.టి.ఆర్‌ల మీద సినిమాలు వచ్చాయి. ఘంటసాల, ఎ.ఎన్‌.ఆర్, యస్వీ రంగారావుల మీద రాబోతున్నాయని చెప్పుకుంటున్నారు. ఐతే, బి.ఎన్‌.సర్వార్‌ అనే బెంగాలి దర్శకుడు కుందన్‌ లాల్‌ సైగల్‌ చనిపోయిన తర్వాత (1948) ఆయన మీద బయోపిక్‌ నిర్మించారు. దానిపేరు ‘‘అమర గాయకుడు-సైగల్‌’’. సైగల్‌ పోలికలతో ఉన్న ఒక నటుడి చేత ఆ పాత్ర ధరింపచేసి, 2 గంటలు చిత్రం తీశాడు సర్కార్‌. మన దేశంలో వచ్చిన తొలి బయోపిక్‌ ఇదేనని చెప్పవచ్చు.


-రావి కొండలరావు


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.