కథ నచ్చలేదన్న ఛాయాగ్రాహకుడు
సింగీతం శ్రీనివాసరావు ‘దిక్కట్రపార్వతి’ అని, ఒక సామాజిక చిత్రం తీశారు తమిళంలో. అది, రాజాజి (చక్రవర్తి రాజగోపాలచారి) కథ. లైట్లు ఉపయోగించకుండా, ఉన్న వెలుతురుతోనే చిత్రీకరణ జరిపారు. ఛాయాగ్రాహకుడు రవివర్మ. ఇతడు మన పురాణ వ్యక్తులకు రూపాలు కల్పించిన చిత్రకారుడు రాజా రవివర్మ మునిమనవడు. ‘దిక్కట్రపార్వతి’కి పురస్కారాలు, పేరూ లభించాయి. అలాంటిదే, ఇంకో చిత్రం తియ్యాలని శ్రీనివాసరావు కథ సిద్ధం చేసుకుని, రవివర్మకి పనిచెయ్యమని అడిగితే - అతడు నిరాకరించాడు. కథ నచ్చలేదన్నాడు. అతను ఏ సినిమా పడితే ఆ సినిమా చెయ్యడు. అతనికి కథ నచ్చితేనే చేసేవాడు.


- రావి కొండలరావు


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.