అలా అనసూయ ‘రంగమ్మత్త’గా మారింది
టులందరికీ వారు పోషించిన పాత్రల్లో కొన్ని మంచి గుర్తింపు తెచ్చిపెడతాయి. మరికొన్ని తమ కెరీర్‌నే మార్చేస్తాయి. నటిగా మారిన టీవీ వ్యాఖ్యాత అనసూయ విషయంలో ఇదే జరిగింది. అదేంటంటే? సుకుమార్‌ దర్శకత్వంలో రామ్‌ చరణ్‌ కథానాయకుడుగా వచ్చిన చిత్రం ‘రంగస్థలం’. ఇందులో రంగమ్మత్త అనే పాత్ర చాలా ప్రత్యేకమైంది. అప్పటి వరకు అనసూయ పలు చిత్రాల్లో నటించినా.. ఈ పాత్రతోనే ప్రేక్షకుల హృదయం దోచుకుంది. అంతగా ఆ పాత్రలో ఒదిగిపోయి విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది. తన కోసమే ఈ పాత్ర పుట్టిందా అన్నట్లు తన నటనతో మైమరపించిన అనసూయకు ఈ పాత్ర రావడానికి కారణం ఓ రకంగా కథానాయిక రాశినే. రాశి, అనసూయకి సంబంధం ఏంటి అనుకుంటున్నారా? ఉంది. ముందుగా రంగమ్మత్త పాత్ర కోసం చిత్ర బృందం రాశినే సంప్రదించిందట. ఆ పాత్ర కొంచెం బోల్డ్‌గా ఉంటుందనే విషయం తెలిసిందే. ‘పాత్ర మంచిదే అయినా మోకాళ్లపై వరకు చీర కట్టాలి. ఆ లుక్‌ నాకు సరిపోదు. అందుకే రంగమ్మత్తను తిరస్కరించాన’ని చెప్పుకొచ్చింది రాశి. అలా రాశి వద్దనడంతో అనసూయ రంగమ్మత్తగా మారింది.








Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.