ఒక్క పాటలో 4,500 మంది డ్యాన్సర్లు

ఓ పాటలో నాయికానాయకులతో పాటు నలుగురైదుగురు కనిపించొచ్చు. మహా అయితే ఇరవై. అదే బృందంతో కలిసి పాడుకునే పాట అయితే వంద.. వెయ్యి. అంతకు మించి ఎక్కువ మందిని ఊహించగలమా? లేదు కదా. భావించడానికే కష్టమైన పని ఇది. మరి అలాంటిది ఒకే ఒక్క పాట కోసం 4,500 మంది డ్యాన్సర్లు నృత్యం చేస్తే ఎలా ఉంటుంది. ఆ సంఖ్య చూస్తేనే అంత మందా? అనే ఆశ్చర్యం కలుగుతుంది కదా. త్వరలోనే వెండితెరపై ఈ అద్భుత దృశ్యం ఆవిష్కరణ కాబోతుంది. ఇంతకీ ఏ సినిమాలోదీ పాట అది అనే కదా సందేహం? ప్రముఖ కథానాయకుడు చిరంజీవి కలల ప్రాజెక్టుగా, భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ‘సైరా’లోదే! ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్రాధారంగా దర్శకుడు సురేందర్‌ రెడ్డి తీస్తున్న చిత్రమిది. ఇందులో జాతరకు సంబంధించిన ఓ పాట ఉంది. ఆనాటి వాతావరణాన్ని కళ్లుకు కట్టినట్టు చూపించేందుకు ఇంతటి భారీ సంఖ్యలో డ్యాన్సర్లని ఎంపిక చేసుకుంది చిత్ర బృందం. ఈ పాట చిత్రీకరణకు 14 రోజుల సమయం పట్టిందట. ఈ అద్భుత దృశ్యాన్ని వెండితెరపై చూడాలంటే కొన్ని రోజులు వేచి చూడాల్సిందే. గాంధీ జయంతి సందర్భంగా అక్టోబరు 2న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం. కొణిదల ప్రొడక్షన్‌ కంపెనీ పతాకంపై నటుడు రామ్‌ చరణ్‌ నిర్మిస్తున్నారు.



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.