వన్నె తరగని అందం కాజల్ సొంతం. అందంతో పాటు అభినయంలోనూ తనకి తిరుగులేదని చాలా చిత్రాలతో చాటి చెప్పారు. ఇటీవల శర్వానంద్‌తో కలిసి ‘రణరంగం’లో నటించారు. ఆ చిత్రం 15న వస్తోంది. ఈ సందర్భంగా కాజల్ శుక్రవారం విలేకర్లతో చెప్పిన విషయాలివీ...
‘రణరంగం’లో మీ పాత్ర ఎలా ఉంటుంది?ద్వితీయార్ధంలో వచ్చే పాత్ర నాది. నేనొక వైద్యురాలిగా కనిపిస్తానంతే. కథానాయకుడు, నేను ఒకరికొకరు ఎలా సాయం చేసుకొన్నామన్నది ఆసక్తికరం.
‘సీత’ ఫలితం నిరుత్సాహపరిచిందా?అందులో నా నటన, పాత్ర విషయంలో ఇప్పటికీ సంతోషంగా ఉన్నా. కానీ ఆశించిన ఫలితం రాలేదు. మళ్లీ అలాంటి పాత్రలు వస్తే చేయడానికి సిద్ధమే.
ఆ మధ్య మేకప్ లేకుండా తీయించుకొన్న మీ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పెట్టడానికి కారణం?
ఒక బలమైన సందేశం ఇచ్చేందుకే ఆ ఫొటో షూట్ చేశా. అందం అంటే మేకప్ అనే భ్రమలోకి వచ్చేశారు చాలా మంది. సామాజిక అనుసంధాన వేదికలు అందుబాటులోకి వచ్చాక చాలామంది ముస్తాబై ఫొటోలు తీసుకోవడం, పోస్ట్ చేయడమే పనిగా పెట్టుకొన్నారు. అందం అంటే మనలా మనం కనిపిస్తూనే, ఆత్మవిశ్వాసంతో మెలగడమే అన్నది నా నమ్మకం.
మీరు నటించిన ‘అ!’ దర్శకుడు ప్రశాంత్ వర్మతో ఓ సినిమాని నిర్మించబోతున్నారట..?మంచి కథ సిద్ధమైతే నిర్మాతగా మారతా.