తొమ్మిదిలో ప్రేమ, పదిలో బ్రేకప్‌!!
‘‘నా మిత్రులందరి కన్నా నేనే ఆలస్యంగా ప్రేమలో పడ్డాను. కానీ, నన్ను ఇష్టపడిన అబ్బాయి పదో తరగతి పరీక్షలొస్తున్నాయని నన్ను వదిలేశాడు’’ అని తన తొలిప్రేమ కబుర్లను మీడియాతో పంచుకుంది నటి తాప్సీ పన్ను. తెలుగు, తమిళ, బాలీవుడ్‌ పరిశ్రమలో అగ్రనాయికగా మెరుపులు మెరిపించిన ఈ అమ్మడు ఇటీవలే పీబీఎల్‌ (ప్రీమియర్‌ బ్యాడ్మింటన్‌ లీగ్‌)లోకి అడుగుపెట్టింది. ఈ లీగ్‌లో పూణే 7 ఏసెస్‌ జట్టుకు సహ యజమానిగా వ్యవహరిస్తోంది. తాజాగా ఈ జట్టుకు సంబంధించిన ఓ కార్యక్రమం భువనేశ్వర్‌లో జరగ్గా అందులో పాల్గొని మీడియాతో ముచ్చటించింది. ఈ సందర్భంగా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి కొన్ని ఆసక్తికర సంగతులను వెల్లడించింది.


* తొమ్మిదిలో తొలిప్రేమ..

‘‘నా స్నేహితులందరి కన్నా ఆలస్యంగా ప్రేమలో పడింది నేనే. తొమ్మిదో తరగతిలో చదివే రోజుల్లో తొలిసారి ప్రేమలో పడ్డాను. ఈ విషయం విని అందరికీ ఆశ్చర్యం కలగొచ్చు. మా ప్రేమ ఏడాది పాటు నడిచింది. ఆ తర్వాత నన్ను ప్రేమించిన అబ్బాయి పదో తరగతి పరీక్షలొస్తున్నాయని చెప్పి నన్ను వదిలేశాడు. అప్పుడు నాకు చాలా బాధగా అనిపించింది. ఆ రోజుల్లో ఇప్పట్లా సెల్‌ఫోన్లు లేవు కదా. అందుకే మా ఇంటి పక్కనే ఉండే పీసీవో నుంచి తనకు ఫోన్‌ చేసి ఏడ్చేదాన్ని. నన్నెందుకు వదిలేశావ్‌? అని అడిగేదాన్ని. ఇప్పువన్నీ తలచుకుంటే నవ్వొస్తుంది’’.

‘‘నాకు ప్రేమ పెళ్లి చేసుకోవాలనే ఉంటుంది. ఒకవేళ నేను ఎవరినైనా ప్రేమిస్తే ఆ విషయం ధైర్యంగా బయటకి చెప్పేస్తా. నేను ఫలానా వ్యక్తిని పెళ్లి చేసుకోబోతున్నానని అందిరికీ తెలియజేస్తా. నేను ఆగస్టు 1న పుట్టా. నాది సింహరాశి. అందువల్లే ఏమో.. నా వ్యక్తిగత జీవితంతోపాటు, నేను చేసే పనిలోనూ ఉన్నతంగా ఉండాలనుకుంటా. నా జీవితంలోకి వచ్చే వ్యక్తి ఆలోచనలు కూడా ఇలాగే ఉండాలి. మా అభిప్రాయాలు కలవాలి. అతన్ని చూడగానే నాకు మర్యాద ఇవ్వాలనిపించాలి. అలాంటి వ్యక్తి కనపడితే వెంçనే ఓకే చెప్పేస్తా’’ అని తెలిపింది తాప్సీ.© Sitara 2018.
Powered by WinRace Technologies.