సాహితీ సేద్యంలో సినీ సుమం!
                                      
హిందీ సాహిత్యంతో ఏమాత్రం పరిచయం ఉన్నా జావేద్‌ అక్తర్‌ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక హిందీ సినిమా గీతాలను అభిమానించేవారికి ఆయన పాటలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. కవిగా, గీత రచయితగా, స్క్రీన్‌పే రచయితగా చిరస్మరణీయమైన ముద్ర వేసిన ఈయన సాహిత్య అకాడమీ అవార్డు, పద్మభూషణ్‌ అవార్డులు అందుకున్నారు. అయిదు సార్లు జాతీయ పురస్కారాలు పొందారు. గ్వాలియర్‌లో 1945 జనవరి 17న పుట్టిన జావేద్‌ అక్తర్‌ది సినీ నేపథ్యం ఉన్న కుటుంబమే. తండ్రి జాన్‌ నిసార్‌ అక్తర్‌ బాలీవుడ్‌ గీత రచయిత. తల్లి రచయిత్రి, గాయని. రాజేష్‌ ఖన్నా నటించిన ‘హథీ మేరే సాథీ’ సినిమాతో సలీమ్‌ఖాన్‌తో కలిసి స్క్రీన్‌ప్లే రచయితగా సినీ రంగప్రవేశం చేసిన జావేద్‌ అక్తర్, ఆపై ‘అందాజ్‌’, ‘సీతా ఔర్‌ గీతా’, ‘యాదోంకి బారాత్‌’, ‘జంజీర్‌’, ‘దీవార్‌’, ‘షోలే’, ‘డాన్‌’, ‘మిస్టర్‌ ఇండియా’లాంటి ఎన్నో విజయవంతమైన చిత్రాలకు తన కలం పదును చూపించారు. బాలీవుడ్‌లో తమదైన ముద్ర వేసిన ఫర్హాన్‌ అక్తర్, జోయా అక్తర్‌లు ఈయన సంతానమే. మొదటి భార్యకు విడాకులు ఇచ్చిన తర్వాత బాలీవుడ్‌ నటి షబానా అజ్మీని జావేద్‌ అక్తర్‌ రెండో వివాహం చేసుకున్నారు.



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.