అద్నాన్‌ సమీ స్వరం నుంచి కొత్తపాట
ష్టమైన అమ్మాయి మాట్లాడకపోయినా.. ఓ సారి తనని చూస్తే చాలు, నవ్వితే చాలు అని ఫీల్‌ అవుతుంటారు అబ్బాయిలు. కథానాయిక నేహాని ఇదే అడుగుతున్నాడు యువ హీరో కార్తికేయ. అక్కడితో ఆగకుండా పాటందుకున్నాడు. వీళ్లిద్దరూ జంటగా నటిస్తున్న చిత్రం ‘90 ఎం.ఎల్‌’. శేఖర్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ చిత్రంలోని ఓ పాటకు సంబంధించిన లిరికల్‌ వీడియో విడుదలైంది. ‘ఓ సారి చూస్తే చాలు, ఓ సారి నవ్వితే చాలు’ అంటూ సాగే ఈ పాట యువతను ఆకట్టుకుంటుంది. ప్రముఖ గాయకుడు అద్నాన్‌ సమీ వాయిస్‌ శ్రోతల్ని అమితంగా అలరిస్తుంది. చాలా కాలం తర్వాత ఆయన నుంచి తెలుగు పాట రావడంతో అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. చంద్రబోస్‌ సాహిత్యం అందించగా, అనూప్‌ రూబెన్స్‌ స్వరాలు సమకూర్చారు. కార్తికేయ క్రియేటివ్‌ వర్క్స్‌ పతాకంపై అశోక్‌ రెడ్డి గుమ్మకొండ నిర్మిస్తున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.