బన్నీ కోసం అదిరిపోయే మెలోడి రెడీ

త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో బన్నీ కథానాయకుడుగా వస్తున్న చిత్రం ‘అల వైకుంఠపురములో’. ఈ చిత్రానికి తమన్‌ సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే. కుటుంబ కథా నేపథ్యంలో తెరకెక్కుతుందీ చిత్రం. ఇప్పటికే సగం చిత్రీకరణ పూర్తయింది. సంక్రాంతికి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాపై ఇప్పటి నుంచే అంచనాలు పెరుగుతున్నాయి. ఇటీవలే విడుదలైన టీజర్‌కు అభిమానుల నుంచి మంచి స్పందన లభించింది. అందులో బన్నీ చెప్పే డైలాగ్‌ విపరీతంగా అలరిస్తుంది. తాజాగా మరో సర్‌ప్రైజ్‌ ఇచ్చింది చిత్ర బృందం.తమన్‌ అల్లు అర్జున్‌ కోసం మంచి మెలోడీని సిద్ధం చేశాడు. దానికి సంబంధించిన వీడియోను సోషల్‌ మీడియా వేదికగా రిలీజ్‌ చేశారు. ‘నీ కాళ్లని పట్టుకుని ఒదలనన్నవి చూడే నా కళ్లు’ అంటూ సాగే ఈ పాట శ్రోతలను ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. పూర్తి పాటను త్వరలోనే విడుదల చేయనున్నారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యం అందించగా.. ప్రముఖ గాయకుడు సిద్ద్‌ శ్రీరామ్‌ ఆలపించారు. ఆయన వాయిస్ ప్రధానాకర్షణగా నిలిచింది. ఇంకెందుకు ఆలస్యం , మీరూ వినేయండి....





Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.