రూలర్‌ పరిచయ గీతం..
ఎంత మంది మాస్‌ కథానాయకులున్నా అందులో బాలయ్య స్థానమే వేరు. ఆయన డైలాగులకి, పరిచయ గీతాలకి అభిమానులు చేసే హంగామానే వేరు. తాజాగా ‘రూలర్‌’ నుంచి ‘అడుగడుగు యాక్షన్‌ హీరో’ అనే గీతాన్ని విడుదల చేశారు. చిరంతన్‌ భట్‌ సంగీత స్వరకర్త. రామజోగయ్య శాస్త్రి అందించిన సాహిత్యం ఆకట్టుకుంటుంది. సాయి చరణ్‌ ఆలపించిన ఈ గీతం సంగీత ప్రియులను అలరిస్తోంది. డిసెంబర్‌ 20న ప్రేక్షకుల ముందుకు రానున్నాడు ‘రూలర్‌’. ఇందులో బాలయ్య సరసన ముగ్గురు కథానాయికలు కనిపించనున్నారు.



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.