అప్పుడు మున్నీ బద్నామ్‌ హూయి .. ఇప్పుడు మున్నా బద్నామ్‌ హూవా

‘మున్నీ బద్నామ్‌ హూయి’.. సంగీత అభిమానుల్ని ఉర్రూతలూగించిన ‘దబాంగ్‌’ చిత్రంలోని ప్రత్యేక గీతం. ఈ పాటలో నటి మలైకా అరోరా అందం, అభినయంతో విశేషంగా అలరించింది. ఇప్పుడు ఇదే తరహాలో ‘మున్నా బద్నామ్‌ హూవా’ అంటూ సాగే గీతం తెరకెక్కుతోంది. ‘దబాంగ్‌’ సిరీస్‌లో వస్తున్న ‘దబాంగ్‌ 3’ చిత్రంలో ఈ పాటను రూపొందిస్తున్నారు. సల్మాన్‌ కథానాయకుడుగా ప్రభుదేవా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సోనాక్షి సిన్హా కథానాయిక. తాజాగా లిరికల్‌ వీడియోను విడుదల చేసింది చిత్ర బృందం. గతంలో వచ్చిన మున్నీ బద్నామ్‌కి ఏ మాత్రం తగ్గకుండా ప్రత్యేకంగా నిలిచేలా స్వరాలు సమకూర్చారు సాజిద్‌- వాజిద్‌. ధనిష్‌ షబ్రీ సాహిత్యం అందించగా బాద్‌షా ర్యాప్‌లో సాగే పదాలు అందించారు. మమతా శర్మ, కమాల్‌ ఖాన్, బాద్‌షా ఈ పాటను ఆలపించారు. విడుదలైన కొన్ని గంటల్లోనే లక్షల మంది శ్రోతలకు చేరువైంది. వెండితెరపై సల్మాన్‌ స్టెప్పులు చూడాంటే కొన్ని డిసెంబరు వరకు వేచి చూడాల్సిందే.





Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.