ఏ దేవుడో నిన్ను ఏరికోరెనో!
మ్యూజిక్కే ఆయన చేసే మ్యాజిక్‌ కోసం ఎదురు చూస్తుంటుంది. అక్షరాలు ఆయన పాటల పల్లకీని ఎక్కి హొయలొలికించేందుకు పోటీపడుతుంటాయి. ఎవరైనా టైం ఉంటే మంచి పాటలు ఇస్తారు.. లేకపోతే సన్నివేశం డిమాండ్‌ చేస్తే ఇస్తారు. ఈయన ఏంట్రా అవేం కుదరకపోయిన అదరగొట్టే గీతాలతో నిత్యం అలరిస్తూనే ఉంటాడు. అందుకే ఆయన సంగీత సంచలనం అయ్యాడ్రా బుజ్జి అని అనిపించుకుంటాడు. 
దేవీశ్రీ ప్రసాద్‌.. సంగీత అభిమానులకు పరిచయం అవసరం లేని పేరు. డీఎస్పీగా అందరికీ సుపరిచితుడు. ఆయన భాష సంగీతం. ఆయన ధ్యాస సంగీతం. ట్యూన్‌లతో ‘ఆట‘ ఆడుకుంటాడు. పాటల్లో ‘కరెంట్‌’ నింపి థియేటర్లో ప్రేక్షకులతో కిర్రాకు పుట్టించేలా డ్యాన్స్‌ చేయిస్తాడు. సందర్భం ఏదైనా నేపథ్య సంగీతం అందించటంలో ‘సరిలేరు నీకెవ్వరు’ అనిపించుకునే దేవీ మ్యూజిక్‌ విని ఎవరైనా సరే మైక్‌ పట్టుకుని పాడాల్సిందే.. పెన్ను పేపరు తీసుకుని రాయాల్సిందే. అందుకే దేవీ పుట్టిన రోజు సందర్భంగా ఆయన అభిమానులు ఓ పాటను పాడి సర్‌ప్రైజ్‌ చేశారు. ‘ఏ దేవుడో నిన్ను ఏరికోరినో’ అంటూ సాగే ఈ పాట అభిమానుల్ని అమితంగా ఆకట్టుకుంటుంది.


                                    


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.