‘యూటర్న్‌’.. కర్మ థీమ్‌ పాట చూశారా?

సమంత తొలిసారిగా నాయికా ప్రాధాన్యమున్న పాత్రలో నటిస్తున్న చిత్రం ‘యూటర్న్‌’. ఆది పినిశెట్టి, రాహుల్‌ రవీంద్రన్, భూమిక కీలక పాత్రల్లో నటిస్తున్నారు. పవన్‌ కుమార్‌ దర్శకత్వం వహించారు. కన్నడ సూపర్‌ హిట్‌ చిత్రం ‘యూటర్న్‌’కు రీమేక్‌గా తెలుగు, తమిళ భాషల్లో రూపొందించారు. పూర్ణచంద్ర స్వరాలు సమకూర్చారు ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌తో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడగా.. తాజాగా ‘యూటర్న్‌ కర్మ థీమ్‌’ పేరిట ఓ ప్రత్యేక గీతాన్ని ట్విట్టర్‌ ద్వారా విడుదల చేశారు సమంత. సామ్, యువ సంగీత దర్శకుడు అనిరుథ్‌ రవిచందర్‌లపై ఈ పాటను చిత్రీకరించారు. ఈ పాటకు సామ్‌ వేసిన ఫాస్ట్‌బీట్‌ స్టెప్పులు ఆకట్టుకునేలా ఉన్నాయి. ఇందులో సామ్, రాహుల్‌ జర్నలిస్టులుగా కనిపించబోతుండగా.. ఆది పోలీస్‌ అధికారిగా నటిసున్నాడు. ఓ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం సెప్టెంబరు 13న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.© Sitara 2018.
Powered by WinRace Technologies.