యూట్యూబ్లో సందడి చేస్తున్న 'ఎంతో ఫన్'..

అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, వరుణ్‌ తేజ్‌ కలిసి నటిస్తున్న చిత్రం ‘ఎఫ్‌2: ఫన్‌ అండ్‌ ప్రస్టేషన్‌ అనేది ఉపశీర్షిక. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు సినిమాను నిర్మించారు. దేవిశ్రీ ప్రసాద్‌ బాణీలు అందించారు. ఈ సినిమా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. జనవరి 11న అమెరికాలో సినిమా ప్రీమియర్‌ షోలు నిర్వహించనున్నారు. తాజాగా చిత్ర ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ‘ఎంతో ఫన్‌’ అని సాగే పాటను విడుదల చేశారు. ఇందులో వెంకీ, తమన్నాల పెళ్లి.. ఇద్దరి దాంపత్య జీవితాన్ని చూపించారు. సినిమా థియేటర్‌కు వెళ్లిన వెంకీ సినిమా చూడకుండా.. పక్కన కూర్చున తన భార్య తమన్నాను చూస్తూ తెగ మురిసిపోతూ కనిపించారు. ఈ పాటకు యూట్యూబ్‌లో మంచి స్పందన లభిస్తోంది. ఈ పాటను దేవిశ్రీ ఆలపించారు.© Sitara 2018.
Powered by WinRace Technologies.