మై డియర్‌ డార్లింగ్‌.. ఎందుకంత ఫైరింగ్‌

గోపీచంద్‌ కథానాయకుడుగా తిరు దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘చాణక్య’. బాలీవుడ్‌ కథానాయిక జరీన్‌ ఖాన్‌ ఈ చిత్రంతో టాలీవుడ్‌కు పరిచమవుతోంది. మరో కథానాయికగా మెహరీన్‌ నటిస్తుంది. తాజాగా ఈ చిత్రంలోని మొదటి పాటను విడుదల చేసింది చిత్ర బృందం. ‘డార్లింగ్‌ మై డియర్‌ డార్లింగ్‌.. ఎందుకంత ఫైరింగ్‌’ అంటూ సాగే ఈ పాట శ్రోతలను అలరిస్తుంది. గోపీచంద్‌, మెహరీన్‌ మధ్య మాటలు లేనపుడు వచ్చే గీతంగా అనిపిస్తుంది సాహిత్యం గమనిస్తే. సంగీత దర్శకుడు విశాల్ చంద్ర శేఖర్‌ స్వరాలు సమకూర్చగా రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు. గానం: హరిణి.

                             


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.