‘దిమాక్‌ కరాబ్‌’ చేసేందుకు వచ్చేశారు!

సిలక సిలక సిలకా ఇది సితరాంగి సిలక... పిలగ పిలగ పిలగా పెట్టిపోరా సురక’ అనే పాట సంగీత అభిమానుల్ని ఎంతగా ఉర్రూతలూగించిందో ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు. ఈ పాట వస్తున్నప్పుడు థియేటర్లలో సందడి అంతా ఇంతా కాదు. రామ్‌ కథానాయకుడుగా పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో వచ్చిన ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ చిత్రంలోది ఈ పాట. కాసర్ల శ్యాం అందించిన సాహిత్యానికి మణిశర్మ స్వరాలు సమకూర్చారు. సాకేత్, కీర్తన శర్మ ఆలపించారు. ప్రేక్షకుల్ని ఆడియో ఎంతగా ఆకట్టుకుందో, ఈ పాటలో అభినయించిన రామ్, నభా నటేష్, నిధి అగర్వాల్‌ అదే తరహాలో అలరించారు. ఇటీవలే సినిమా విడుదలైన కొన్ని రోజులకే డిజిటల్‌ వేదికలపై వీడియో పాటలను విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ రిలీజై చాలా రోజులు కావడంతో అభిమానులు ఎప్పుడెప్పుడు ఈ పాట వస్తుందా అని ఎదురుచూశారు. అంతేకాదు సోషల్‌ మీడియా వేదికగా చిత్ర దర్శక, నిర్మాతలను ప్రశ్నించడం.. ఈ పాటకు ఎంత ఆదరణ లభించిందో తెలుస్తుంది. తాజాగా చిత్ర బృందం అభిమానులకు సర్‌ప్రైజ్ ఇచ్చింది. ‘దిమాక్‌ కరాబ్‌’ అంటూ సాగే ఈ పాటకు సంబంధించి ఫుల్‌ వీడియోను విడుదల చేసింది. ఇప్పటికే వేలమంది వీక్షకులు ఈ పాటను చూశారు. ఇంకెందుకు ఆలస్యం. మీరూ చూసేయండి....Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.