తొలి పరిచయమా ఇది!

‘ఆర్‌ఎక్స్‌ 100’ సినిమా ఫేం కార్తీకేయ నటిస్తున్న చిత్రం ‘గుణ 369’. ఈ సినిమాలోని తొలి పాటను ఇటీవలే నిర్మాత దిల్‌ రాజు విడుదల చేశారు. ‘ఉదయించిన వేకువలోన.. నయనంలో తొలికలవై, అలలెగిసిన గుండెలోన.. ఊహలకే ఊపిరివై’ అంటూ సాగుతుందీ పాట. శుభం విశ్వనాథ్‌ సాహిత్యం అందరిని ఆకట్టుకుంటుంది. గాయకుడు హరిచరణ్‌ ఈ పాటను ఆలపించారు.సంగీతం చైతన్య భరద్వాజ్‌. తాజాగా దీనికి సంబంధించిన మేకింగ్‌ వీడియోను విడుదల చేసింది చిత్ర బృందం. ఎస్జీ మూవీ మేకర్స్‌ పతాకంపై దర్శకుడు అర్జున్‌ జంధ్యాల ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. అనఘ కథానాయిక.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.