పదిమంది ఉండగా ‘ప్రతిరోజూ పండగే‘

ఇద్దరు వ్యక్తులు కలిసుంటేనే ఎంతో ఆనందం. అలాంటిది పదిమంది ఒకేచోట చేరితే పండగే. ఆ పండగ వాతావరణాన్ని వెండితెరపై ఆవిష్కరించేందుకు సిద్ధమైంది ‘ప్రతిరోజూ పండగే’ చిత్ర బృందం. మారుతి దర)కత్వంలో యువ కథానాయకుడు సాయి ధరమ్‌తేజ్‌ నటిస్తున్న చిత్రం. రాశిఖన్నా కథానాయిక. తాజాగా ఈ చిత్రంలోని పాటను విడుదల చేశారు. ‘పది మంది ఉండగా ప్రతిరోజూ పండగే’ అంటూ సాగే ఈ పాట శ్రోతల్ని అలరిస్తుంది. రచయిత కె.కె. అందించిన సాహిత్యం ఆకట్టుకుంటుంది. తమన్‌ స్వరాలు సమకూర్చగా శ్రీ కృష్ణ ఆలపించారు. బంధాల్ని తెలియజేసే పాట కావడంతో అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంటుంది. గీతా ఆర్ట్స్‌ 2, యూవీ క్రియేషన్స్‌ పతాకంపై బన్నీ వాసు నిర్మిస్తున్న త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

                               


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.