కులం పాటతో మనసుల్ని కదిలిస్తోన్న వర్మ..

న తాజా చిత్రం ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ నుంచి మరో పాటను విడుదల చేశారు దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ. ఆయన ముందుగా చెప్పినట్లుగానే ‘క్యాస్ట్‌ ఫీలింగ్‌’’ అంటూ సాగే ఈ గీతాన్ని.. నేటి ఉదయం 9గం.27 నిముషాలకి బ్రహ్మ ముహూర్తంలో విడుదల చేశారు. విద్య, ఉద్యోగం, రాజకీయం ప్రతి దానికీ ప్రామాణికంగా కులమే నిలస్తున్నప్పుడు బహిర్గతంగా కులం గురించి చెప్పుకుంటే తప్పేముంది. అనే ధోరణిలో సాగుతున్న ఈ పాట ఆద్యంతం ఆలోచింపజేసేలా ఉంది. పూర్తిగా వర్మ వాయిస్ ఓవర్‌తో సాగిన ఈ పాటలో ఆయన చెప్పిన కొన్ని సంభాషణలు ప్రతి ఒక్కరినీ కదిలిస్తున్నాయి. దీనికి రవి శంకర్‌ స్వరాలు సమకూర్చగా.. సిరా శ్రీ సాహిత్యాన్ని అందించారు.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.