యూట్యూబ్‌లో అదరగొడుతున్న సాయి పల్లవి

‘భానుమతి ఒకటే పీస్‌. హైబ్రిడ్‌ పిల్ల’.. ఈ డైలాగ్‌ వినగానే గుర్తొచ్చే పేరు సాయి పల్లవి. పక్కా తెలంగాణ అమ్మాయి పాత్రలో కనిపించి తన నటనతో అందర్ని ‘ఫిదా’ చేసింది. యువత హృదయాల్లో నిలిచిపోయింది. నటనతోనే కాదు తన డ్యాన్స్‌తోనూ అలరించింది. ఈమె సినిమాల్లోకి రాకముందు రియాలిటీ డ్యాన్స్‌ షోలో పాల్గొన్న విషయం తెలిసిందే. అందుకేనేమో ఈ భామ ఏ పాటకు స్టెప్పులేసిన పేక్షకులు కూడా కాలు కదపాల్సిందే. అంతగా క్యాచీ మూమెంట్స్‌తో అందరిని ఆకట్టుకుంటుంది. ‘ఫిదా’ చిత్రంలోని ‘వచ్చిండే మెల్ల మెల్లగ వచ్చిండే’ పాటకు పల్లవి చేసిన డ్యాన్స్‌ మరిచిపోగలమా? వెండి తెరపైనేకాక ఇప్పుడు యూట్యూట్‌లోనూ హల్‌చల్‌ చేస్తోంది ఈ పాట. అంతకు మించి ఆమె నటించిన ‘మారి 2’ చిత్రంలోని ‘రౌడీ బేబీ’ సాంగ్‌ సంచలన విజయం సాధించింది. ఈ రెండు పాటల్ని యూట్యూబ్‌లో మిలియన్ల సంఖ్యలో నెటిజన్లు వీక్షించారు. తాజాగా ఈ జాబితాలో నానితో నటించిన ‘ఎంసీఏ’ చిత్రంలోని ‘ఏవండోయ్‌ నాని గారు’ పాట చేరింది. ఏకంగా వంది మిలియన్‌ వ్యూస్‌ సొంతం చేసుకుని సాయి పల్లవికి మరో రికార్డు అందించింది. ఇంతటి ప్రేక్షకాధరణ వచ్చిన మూడు పాటలు ఒకే హీరోయిన్‌ ఖాతాలోకి రావడం విశేషం.







Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.