టైటిల్‌ సాంగ్‌తో అదరగొడుతున్న ‘రామకృష్ణ’

‘రామకృష్ణ తెనాలి.. నా మాటే వినాలి’ అంటున్నాడు యువ కథానాయకుడు సందీప్‌ కిషన్‌. అంతేకాదు లైఫే కులుమనాలి అయిపోవాలి అని ఉపదేశం చేస్తున్నాడు. ఎందుకంటే? ఆయన లాయరు అయ్యాడు కాబట్టి. నిజ జీవితంలో కాదులేండీ. ప్రస్తుతం ఆయన ‘తెనాలి రామకృష్ణ’ అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో లాయరుగా కనిపించబోతున్నాడు సందీప్‌. నాగేశ్వర్‌రెడ్డి దర్శకుడు. తాజాగా ఈ చిత్రంలోని టైటిల్‌ సాంగ్‌ విడుదలైంది. రామకృష్ణ తెనాలి.. నా మాటే వినాలని పాట ద్వారా హుషారు పెంచుతున్నాడు. ఏ పనిలోనైనా కాంప్రమైజ్‌ అయితే పండగే అని చెప్పే నేపథ్యంలో సాగే పాట ఇది. భాస్కర్‌ భట్ల రవికుమార్‌ అందించిన సాహిత్యానికి సాయి కార్తీక్‌ సంగీతం తోడై శ్రోతలను అలరిస్తుంది. గాయకుడు సాయి మాధవ్‌ ఈ పాటను ఆలపించారు. ఇంకెందుకు ఆలస్యం మీరూ వినేయండి...





Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.