పడుచందం పక్కనుంటే..

‘‘పడుచందం పక్కనుంటే.. పడిపోదా పురుష జన్మ. అలా పడిపోకపోతే ఏం లోటో ఏమో కర్మ..’’ అంటున్నారు రొమాంటిక్‌ కింగ్‌ అక్కినేని నాగార్జున. ఆయన, నాని కథానాయకులుగా నటిస్తున్న మల్టీస్టారర్‌ ‘దేవదాస్‌’. రష్మిక, ఆకాంక్ష సింగ్‌ కథానాయికలుగా నటిస్తున్నారు. శ్రీరామ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్‌ పతాకంపై అశ్విని దత్‌ నిర్మిస్తున్నారు. మణిశర్మ స్వరాలు సమకూర్చారు. తాజాగా ఈ చిత్రం నుంచి ‘‘వారూ వీరు పక్కనున్న..’’ అంటూ సాగే ఓ రొమాంటిక్‌ గీతాన్ని విడుదల చేశారు. ఈ పాటలో నాగ్‌- ఆకాంక్ష, నాని- రష్మిక జంటల మధ్య ప్రేమను చూపించారు. ఈ గీతానికి సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యం అందించగా.. అనురాగ్‌ కులకర్ణి, అంజనా సౌమ్య చక్కగా ఆలపించారు. ప్రస్తుతం ఈ పాట యూట్యూబ్‌లో టాప్‌ ట్రెండింగ్‌లో 11వ స్థానంలో నిలిచింది. ఇది విడుదలైన రెండు రోజుల్లోనే 12 లక్షల మందికి పైగా వీక్షించడం విశేషం.© Sitara 2018.
Powered by WinRace Technologies.