అమ్మైనా, నాన్నైనా నువ్వే ‘వెంకీ మామ’


వెంకటేష్, నాగ చైతన్య మామా అల్లుళ్లుగా దర్శకుడు బాబీ తెరకెక్కిస్తున్న చిత్రం ‘వెంకీ మామ’. రాశిఖన్నా, పాయల్‌ రాజ్‌పుత్‌ కథానాయికలు. తాజాగా ఈ చిత్రంలోని తొలి పాటకు సంబంధించిన లిరికల్‌ వీడియో విడుదలైంది. ‘ద్రాక్షారం జంగమయ్య భీమలింగయ్య.. బిడ్డల కాచుకోవయా!’ అంటూ ఫిమేల్‌ వాయిస్‌తో ప్రారంభమయ్యే ఈ పాట ఆద్యంతం శ్రోతల్ని అలరిస్తుంది. మామ వెంకటేష్‌ గురించి అల్లుడు నాగ చైతన్య చెప్పే సంగతుల్ని గాయకుడు శ్రీ కృష్ణ ఆలపించారు. రామజోగయ్య శాస్త్రి అందించిన ‘మామా మామా.. నే పలికిన తొలి పదమా, నాకే దొరికిన వరమా, నాకై నిలిచిన బలమా’ సాహిత్యం సంగీత అభిమానుల్ని అలరిస్తుంది. సురేష్‌ ప్రొడక్షన్‌ పతాకంపై నిర్మితమవుతున్న ఈ చిత్రానికి తమన్‌ స్వరాలు సమకూర్చారు.
      
                               


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.