బతుకు తీపి పాటలో మధుర స్వరం.. స్నేహం
స్నేహమంటే ఏంటో తెలుసా మీకు? నువ్వు ఎవరినైన కత్తితో పొడిచి హత్య చేస్తే నా స్నేహితుడు ఎవరి కడుపులోనో కత్తి దాచుకున్నాడని నమ్మడమే స్నేహం. అవును ఇది ఓ సినిమాలోని డైలాగే అయినా ఆలోచిస్తే నిజమే అనిపిస్తుంది. ఎందుకంటే స్నేహమంటే ఇవ్వడం, తీసుకోవడం కాదు ఒకరినొకరు నమ్మడం. తల్లి దండ్రులకు చెప్పుకోలేని, భార్య దగ్గర భర్త, భర్తతో భార్య పంచుకోలేని ఎన్నో విషయాలు స్నేహితుల దగ్గరే చెప్పుకోగలం. ఏ ఎమోషన్‌ అయినా చెప్పుకోవడానికి ఏ అవసరమైనా పంచుకోవడానికి మనతో ఉండేవాడే మిత్రుడు. మామా, మచ్చ, బాబాయ్, బావా, బ్రో, డ్యూడ్, దోస్త్, ఫ్రెండ్, యారి.. పేరు ఏదైనా బంధం అదే. వెలుగులోనే కాదు చీకట్లో కూడా నీడగా తోడుంటాడు. మనం పాపలా ఉన్నప్పుడు తను కన్నులా పర్యవేక్షిస్తాడు.. మనం పాదం అయితే తన మన్నులా మారి మనల్ని మోస్తాడు.స్నేహం గొప్పతనాన్ని తెలిపేందుకు వెండితెర ప్రయత్నిస్తూనే ఉంటుంది. అవకాశం ఉన్నప్పుడల్లా రచయితలంతా స్నేహం విలువ ప్రేక్షకులకు అందించాలని కోరుకుంటుంటారు. స్నేహానికి సంబంధించిన సన్నివేశాలు, పాటలు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నాయి. నాటి ఆత్రేయ,వేటూరి సుందర్రామ్మూర్తి.. నేటి చంద్రబోస్, రామజోగయ్యశాస్త్రి వరకు తమ అనుభవంతో ఎవరు ఎలా వర్ణించినా భావం మాత్రం ఒకటే. ఇలాంటి స్నేహం విలువ తెలిపిన పాటలను స్నేహితుల దినోత్సవం సందర్భంగా ఓ సారి నెమరువేసుకుందాం...


* స్నేహమంటే ఇదేరా!

స్నేహమంటే ఊపిరి కదరా.. ప్రేమను పంచే గుణమే కదరా..


దేవుని గుడిలో హారతి లాగా.. తూరుపు దిక్కున వేకువ లాగా కిలకిల గువ్వల సవ్వడి లాగా మధురం కదరా..


స్నేహమ³ంటే చాలన్నా ఏదీ లేకున్నా కలకాలం ఇట్టా కలిసుందాం ఎవ్వరు ఏమన్నా


స్నేహమంటే ఇదేరా నమ్మర పెద్దన్న కలకాలం ఇట్టా కలిసుందాం ఎవ్వరు ఏమన్నా
* ఉన్నది ఒకటే జిందగీ


ట్రెండు మారినా ఫ్రెండు మారడే బెండు కానీ బాండు పేరు ఫ్రెండ్‌షిప్పే..


ట్రెండు మారినా ఫ్రెండు మారడే గుండెలోన సౌండు పేరు ఫ్రెండ్‌షిప్పే..*ప్రేమదేశం 


ముస్తఫ్ఫా డోంట్‌ వర్రీ ముస్తఫ్ఫా కాలం నీ నేస్తం ముస్తఫ్పా


వాడిపోనిది స్నేహమొక్కటే. వీడిపోనిది నీడ ఒక్కటే హద్దంటూ లేనే లేనిది ఫ్రెండ్‌షిపొక్కటే
* నీ స్నేహం


కొంతకాలం కిందట బ్రహ్మ దేవుని ముంగిట రెండు ఆత్మలు కోరుకున్నవి ఓ వరం


రూపు రేఖలు వేరట ఊపిరొకటై సాగగా ఆ వరాన్నే స్నేహమంటున్నాం మనం

                                   *పెళ్లి పందిరి


దోస్త్‌ మేరా దోస్త్‌ మేరా దోస్త్‌ తూహీ మేరా జాన్‌


వాస్తవంరా దోస్త్‌ నువ్వే నా ప్రాణం


బతుకు తీపి పాటలో మధుర స్వరాలం మనం


స్నేహమనే మాటలో చెరో అక్షరం మనం

*స్నేహితుడు


మన ఫ్రెండల్లే ఇంకెవడుంటాడు జనమందరిలో తానొకÛడేంకాదు


మన గుండెల్లోనే ఉన్నవాడు కనుపాపలకెందుకు ఎదురైరాడు


మరొకొన్ని:* నేను తానని(ఓ మై ఫ్రెండ్‌)


* స్నేహమేరా జీవితం(నిప్పులాంటి మనిషి)


* మీసమున్న నేస్తమా


* మన ఫ్రెండల్లే ఇంకెవడుంటాడు


* హుషారు


* నీ స్నేహం ఇక రాదు అని(మనసంతా నువ్వే)


* నేస్తమ ఇద్దరి లోకం ఒకటేవమ్మ


* ఫ్రెండ్‌ అంటే బెస్ట్‌ జోడి


* ఒక స్నేహమే..స్నేహగీతం


* భగీరథ


*స్నేహమేరా జీవితం

Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.