లోకనాయకుడి నట ప్రస్థానానికి 60 ఏళ్లు

‘‘లోకమందున నిన్ను మించగా లేరు.. నీదు పుట్టుక భరతమాతకే పేరు.. లోక నాయకుడా..’’ ఇది ‘దశావతారం’ చిత్రంలోని పాట మాత్రమే కాదు కమల్‌ హాసన్‌ నటనకు సరితూగే మాట. పాత్ర ఏదైనా అందులో పరకాయ ప్రవేశం చేయడమొక్కటే ఆయనకు తెలిసింది. సినిమా సినిమాకు వైవిధ్యం చూపించాలనేదే ఆయన కావాల్సింది. జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడిగా 3 సార్లు పురస్కారం అందుకున్నా.. 18సార్లు ఫిలింఫేర్‌ అవార్డులు గెలుచుకున్నా.. తన 6 సినిమాలు ఆస్కార్‌కు ఎంపికైనా.. 1990లో పద్మశ్రీ, 2014లో పద్మభూషణ్‌ లభించినా.. తమిళనాడు ప్రభుత్వం నుంచి ‘కలైమామణి’ బిరుదు దక్కినా.. చెన్నై సత్యభామ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్‌ ప్రదానం చేసినా.. అవేం పట్టనట్టు ఉండటం ఆయనకే సాధ్యం. రొటీన్‌ పాత్రలకు వేల మైళ్ల దూరంలో ఉంటాడు. నారాయణునిది దశావతారం అయితే నటనలో కమల్‌ది శతావతారం. ‘మరో చరిత్ర’, ‘ఆకలి రాజ్యం’, ‘పుష్పక విమానం’, ‘బ్రహ్మచారి’, ‘దశావతారం’, ‘విశ్వరూపం’.. ఇలా ఎన్నో విభిన్న పాత్రలు పోషించి విజయం అందుకున్న కమల్‌ నట ప్రస్థానానికి నేటితో 59 ఏళ్లు పూర్తయ్యాయి. కమల్‌ బాల నటుడిగా ఎంట్రీ ఇచ్చిన తమిళ సినిమా ‘కళత్తూర్‌ కన్నమ్మ’ 1960 ఆగస్టు 12న విడుదలైంది. నాటి నుంచి నేటి వరకు సినీ ప్రియులను అలరిస్తూనే ఉన్నారు.

*కళత్తూర్‌ కన్నమ్మ చిత్రంలో బాల నటుడిగా కమల్‌:


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.