తెర‌తా‌రల లవ్‌.‌.‌.‌ప్యార్‌.‌.‌.‌కాదల్‌

మంచులో తడి‌సిన ఎర్రె‌ర్రని గులాబీ ఇచ్చి ‌‘ఫీల్‌మై‌లవ్‌’‌ అంటూ ఫియా‌న్సీని కన్విన్స్‌ చేయ‌డ‌మె‌లాగో తెలి‌సిన హీరోలు వాళ్లు.‌ ముచ్చ‌టగా ‌‘వన్‌ఫో‌ర్‌త్రీ’‌ చెప్పీ‌చె‌ప్ప‌గానే కల‌వ‌రిం‌తల పల‌వ‌రిం‌త‌ల్లోకి అల‌వో‌కగా జారి‌పోయి కళ్ల వాకి‌ళ్లలో ఈస్ట్‌‌మ‌న్‌క‌ల‌ర్‌ఫుల్‌ కలల్తో కళ్లాపి చల్లేం‌దుకు ఏమాత్రం జాగు‌చే‌యని కథా‌నా‌యి‌కలు వాళ్లు.‌ ‌‘సైలెన్స్, లైట్సాన్, స్టార్ట్‌ కెమెరా’‌ అనే సాంకే‌తిక పద‌రం‌గంలో దర్శ‌కుడి సూచ‌నల మేరకు ఆన్‌స్క్రీన్‌ కెమిస్ట్రీ పండిం‌చేం‌దుకు ఆడి‌పాడే హీరో‌హీ‌రో‌యి‌న్లే.‌.‌ఒక్కో‌సారి ‌‘ఆఫ్‌స్క్రీన్‌’‌లో పీక‌ల్లోతు ప్రేమలో కూరు‌కు‌పోయి పెళ్లి‌చే‌సు‌కుని దంప‌తు‌లైన ఉదం‌తా‌లెన్నో? ఒకే వృత్తి, ఒకే అభి‌రుచి కలి‌గిన ఓ ఇద్దరు ఒకే కప్పు కింద ప్రేమ పునా‌దిగా తాళి‌బంధం సాక్షిగా నూరేళ్లు సహ‌జీ‌వ‌నా‌నికి శ్రీకారం చుట్టడం రంగుల లోకంలో ఎప్పటి నుంచో ఆన‌వా‌యి‌తీగా వస్తోంది.‌ షూటిం‌గ్‌స్పా‌ట్‌లో కలి‌సి‌మె‌లిసి పని‌చే‌య‌డం‌లోని దగ్గ‌రి‌త‌నా‌నికి ముచ్చ‌ట‌ప‌డుతూ మూడు‌ము‌ళ్లతో ఏక‌మయ్యే తెర‌తా‌రం‌లం‌ద‌రికీ ప్రతి‌రోజూ వాలెం‌టై‌న్స్‌డే అన‌డంలో అతి‌శ‌యోక్తి ఏముంది?


టాలీ‌వుడ్, కోలీ‌వుడ్, బాలీ‌వుడ్‌.‌.‌.‌ఇలా భార‌తీయ సినిమా ప్రపం‌చంలో వెండి‌తెర నిండుగా అచ్చ‌మైన స్వచ్ఛ‌మైన ప్రేమని ఆవి‌ష్క‌రిం‌చ‌డమే కాదు.‌.‌.‌గుండె‌తె‌రపై కూడా ఆవి‌ష్క‌రిం‌చు‌కుని అత్య‌ద్భు‌త‌మైన వర్ణ‌చి‌త్రంగా జీవి‌తాన్ని మల‌చు‌కున్న ప్రేమి‌కుల జాబి‌తాకి కొద‌వే‌లేదు.‌ నాడు అమి‌తాబ్‌ బచ్చన్‌ నుంచి అక్కి‌నేని నాగా‌ర్జున మీదుగా నేడు అక్కి‌నేని నాగ‌చై‌తన్య వరకు విజ‌య‌వం‌త‌మైన ప్రేమ‌క‌థ‌లెన్నో! అదే సంద‌ర్భంలో ప్రేమనే శ్వాసిస్తూ, శాసిస్తూ, స్మరిస్తూ.‌.‌.‌ ఆ ప్రయా‌ణంలో విజయం సాధిస్తూ.‌.‌అంత‌లోనే విఫ‌ల‌మ‌వుతూ మళ్లీ మళ్లీ మునిగి తేలా‌లనే తహ‌త‌హ‌లాడే ‌‘నయనా’‌నంద‌కర అకాం‌క్ష‌లకూ వెండి‌తెర వేదికే.‌ ప్రేమ గెలిస్తే.‌.‌.‌అది మధుర వ్యాపకం.‌ ఓడితే ఎప్ప‌టికీ మరి‌చి‌పో‌లేని ఓ తీపి జ్ఞాపకం.‌ ఆ వ్యాప‌కాల జ్ఞాప‌కాల తేనె‌టీ‌గల తుట్టెని ఓసారి కది‌లిస్తే ‌‘తెర’‌చిన’‌ పుస్త‌కంలా వాలెం‌టైన్స్‌ కూడా ముచ్చ‌ట‌ప‌డేలా ఎన్నో ప్రేమ‌క‌థలు.‌


బాలీ‌వుడ్‌ లవ్‌స్టో‌రీలు
మొదట్లో సినిమా రంగా‌నికే అస్సలు పని‌కి‌రా‌వంటూ తిర‌స్క‌ర‌ణకు గురై ఒక్కో అవ‌కా‌శాన్ని చేజి‌క్కిం‌చు‌కుని కొన్ని దశా‌బ్దా‌్దల సినీ యానంలో భార‌తీయ సినిమా గర్వించే ఎత్తుకు ‌‘బిగ్‌బి’‌గా అవ‌రిం‌చిన అమి‌తాబ్‌ బచ్చన్, జయ‌బా‌ధు‌రీల ప్రేమ‌కథ ఒక‌ప్పుడు సంచ‌లనం.‌ జయ‌బా‌ధు‌రితో వెండి‌తె‌రను పంచే‌సు‌కో‌వ‌డమే కాకుండా జీవి‌తాన్ని కూడా పంచు‌కున్న ప్రేమి‌కు‌డిగా అభి‌మా‌నుల అభి‌నం‌ద‌నలు అందు‌కుం‌టూనే ఉంటారు.‌ ఆ తర్వాతి తరంలో బిగ్‌బి కుమా‌రుడు అభి‌షేక్‌ బచ్చన్‌ కూడా తల్లి‌దం‌డ్రుల బాట‌లోనే నడిచి ప్రపం‌చ‌సుం‌దరి, బాలీ‌వుడ్‌ అగ్రశ్రేణి కథ‌నా‌యిక ఐశ్వ‌ర్యా‌రా‌య్‌ని వివా‌హ‌మా‌డిన సంగతి తెలి‌సిందే.‌ బాలీ‌వుడ్‌ రంగుల ప్రపంచం నిండా ఇలాంటి ప్రేమ‌క‌థలే ఉన్నాయి.‌ కలల బేహారి రాజ్‌క‌పూర్‌ సృష్టిం‌చిన ‌‘బాబీ’‌ సినిమా ఎంత సక్సెస్‌ సాధిం‌చిందో తెలి‌సిందే.‌ ఆ చిత్రంలో కథ‌నా‌య‌కు‌డిగా రాజ్‌క‌పూర్‌ తన‌యుడు రిషి‌క‌పూర్‌ ప్రధాన భూమిక పోషిం‌చాడు.‌ నాయి‌కగా అప్పట్లో తన అంద‌చం‌దా‌లతో దేశాన్ని ఓ ఊపు ఊపిన డింపు‌ల్‌ కపా‌డియా.‌ తర్వా‌త్త‌ర్వాత ఈ ఇద్దరూ పీక‌ల్లోతు ప్రేమలో మునిగి సహ‌చర నటుల్నే వివా‌హ‌మా‌డారు.‌ రిషి‌క‌పూర్‌ సహ‌నటి నీతూ‌సిం‌గ్‌ని ప్రేమించి పెళ్లా‌డితే.‌.‌.‌డింపుల్‌ కపా‌డి‌యాని అల‌నాటి తరాన్ని తన స్టయి‌ల్‌తో, స్మయి‌ల్‌తో మెస్మ‌రైజ్‌ చేసిన రాజే‌ష్‌ఖన్నా ప్రేమించి పెళ్లా‌డాడు.‌ ఇక, డింపుల్‌ కపా‌డియా కూతురు నిన్నటి ‌‘తెర తారక’‌ ట్వింకిల్‌ ఖన్నాది కూడా ప్రేమ వివా‌హమే.‌ ఎంపిక చేసు‌కున్న చిత్రా‌లతో బాలీ‌వు‌డ్‌లో సక్సె‌స్‌లు సాధి‌స్తున్న హీరో అక్ష‌య్‌కు‌మా‌ర్‌ని వివా‌హ‌మా‌డింది.‌ ‌‘వీలయితే కప్పు కాఫీ.‌.‌.‌కుది‌రితే కాసిన్ని కబుర్ల’‌ంటూ ‌‘బొమ్మ‌రిల్లు’‌ సిని‌మాతో తెలుగు సినీ ప్రియుల్ని ఎంత‌గానో అల‌రిం‌చిన ముద్దు‌గుమ్మ జెనీ‌లియా డిసౌజా కూడా సహ‌చర నటుడు రితేష్‌ దేశ్‌ము‌ఖ్‌ని ప్రేమించి పెళ్లా‌డింది.‌ రాజ్‌క‌పూర్‌ మనవ‌రాలు కరీ‌నా‌క‌పూర్‌ తోటి నటుడు సైఫ్‌ అలీ‌ఖా‌న్‌ని, కాజోల్‌ అజయ్‌ దేవ‌గ‌న్‌ని ప్రేమించి పెళ్లి చేసు ‌కో‌వడం తెలి‌సిన కథలే.‌


టాలీ‌వు‌డ్‌లోనూ ఇవే దృశ్యాలు
టాలీ‌వుడ్‌ ప్రేమ‌క‌థల గురించి ఆరా తీస్తే మొద‌టిగా మనకు గుర్తొ‌చ్చేది సూప‌ర్‌స్టార్‌ కృష్ణ, విజ‌య‌ని‌ర్మల కాంబి‌నే‌షన్‌.‌ అప్పట్లో వరుస సిని‌మాల్తో బిజీ‌బి‌జీగా మారిన ఈ జంట ఏ కాస్త తీరిక చిక్కినా ఒకరి సాన్ని‌హి‌త్యాన్ని ఒకరు కోరు‌కు‌నే‌వా‌రట.‌ అలా అలా సాగిన వారి బంధం చివ‌రికి పెళ్లి‌బం‌ధంతో సెటి‌లైంది.‌ కృష్ణ తన‌యుడు ఇవాల్టి సూప‌ర్‌స్టార్‌ మహే‌ష్‌బాబు కూడా ప్రేమ వివా‌హమే చేసు‌కు‌న్నారు.‌ బాలీ‌వుడ్‌ కథా‌నా‌యి‌కగా కొన‌సా‌గు‌తున్న నమ్రతా శిరో‌ద్క‌ర్‌తో మహేష్‌ ‌‘వంశీ’‌ అనే ఓ సిని‌మాలో నటిం‌చ‌డంతో వారి‌ద్దరి మధ్య ప్రేమ మొల‌కె‌త్తింది.‌ ఆ ప్రేమ చివు‌రించి చివు‌రించి కొన్నాళ్లు గడి‌చాక సన్ని‌హి‌తుల మధ్య ఆ ఇద్దరూ వివాహం చేసు‌కుని జీవి‌తంలో ఒక‌ట‌య్యారు.‌ ఇలా చెప్పు‌కుంటూ పోతే.‌.‌.‌ హీరో రాజ‌శే‌ఖర్, జీవిత, శ్రీకాంత్‌ ఊహ, క్రియే‌టివ్‌ కృష్ణ‌వంశీ నటి రమ్య‌కృష్ణ, శివ‌బా‌లాజీ మధు‌మిత.‌.‌.‌ఇలా జాబితా పెద్ద‌ది‌గానే కని‌పి‌స్తోంది.‌ కోలీ‌వుడ్‌ కూడా ఇలాంటి దృశ్యాలే ఆవి‌ష్కృ‌త‌మ‌వ‌డంతో సూర్య, జ్యోతిక, రాధిక శర‌త్‌కు‌మార్, విజËయ్‌ కుమార్‌ మంజుల‌.‌.‌ఇలా చాలా జంటలే కని‌పి‌స్తాయి.‌

అక్కి‌నేని ఫ్యామిలీ ప్రేమ‌క‌థలు
వెండి‌తె‌రపై రొమాన్స్‌ పండిం‌చ‌డంలో తమ‌దైన బ్రాండ్‌ సెట్‌ చేసు‌కున్న అక్కి‌నేని కుటుం‌బంలో, ఆఫ్‌స్క్రీన్‌ లవ్‌స్టో‌రీలు అప్పుడూ, ఇప్పుడూ సెన్సె‌షన్‌ సృష్టిం‌చా‌యనే చెప్పాలి.‌ ‌‘విక్రమ్‌’‌ సిని‌మాతో ‌‘తెరగేట్రం చేసి అక్కి‌నేని నట‌వా‌ర‌స‌త్వాన్ని అందు‌కున్న నాగా‌ర్జున ‌‘శివ’‌ చిత్రంతో భారీ విజ‌యాన్ని తన ఖాతాలో వేసు‌కో‌వ‌డమే కాకుండా ‌‘టాలీ‌వుడ్‌ మన్మ‌ధుడి’‌గా తన‌కంటూ ప్రత్యేక ఇమే‌జ్‌ని సొంతం చేసు‌కు‌న్నారు.‌ సిని‌మాల్లో నటి‌స్తున్న తొలి‌నా‌ళ్లలో సహ‌చర నటి అమ‌లను ప్రేమించి పెళ్లి చేసు‌కు‌న్నారు.‌ అమల కూడా అక్కి‌నేని కోడ‌లిగా ఎంచక్కా ఇమి‌డి‌పోయి ఇటు సామా‌జిక సేవా‌రం‌గంలో తన‌దైన ముద్రతో ముందుకు సాగడం గమ‌నార్హం.‌ తాజాగా నాగ్‌ తన‌యుడు నాగ చైతన్య, సమం‌తల ప్రేమ−‌ పెళ్లి పలు‌వు‌రిలో ఆసక్తి కలిగించింది.


‌‘చైతు సామ్‌’‌ల ప్రేమ‌కథ
‌‘ఎంత‌మంది ముందు‌కొచ్చి అందాలు చల్లు‌తున్న ఈ గుండె‌కే‌మ‌వ్వలా? నిన్న‌గాక మొన్న వచ్చి ఏమాయ చేసావే.‌.‌.‌పిల్లి‌మొ‌గ్గ‌లేసిం‌దిలా.‌.‌’‌’‌ అంటూ అక్కి‌నేని చిన్నోడు చైతూ అందా‌ల‌రాశి సమంత ముందు మోక‌రిల్లి మరీ లవ్‌ ఎక్స్‌‌ప్రెస్‌ చేసాడు.‌ అది సిని‌మా‌లోనే కాదు.‌ జీవి‌తంలో కూడా.‌ ప్రేమి‌కుల గుండె‌చ‌ప్పు‌డిని వెండి‌తె‌రపై లయ‌బ‌ద్ధంగా అను‌వ‌దిం‌చడం తెలి‌సిన దర్శక మాంత్రి‌కుడు గౌత‌మ్‌మే‌నన్‌.‌ ‌‘ఏమాయ చేసావే’‌ చిత్రం‌లోనే నాయ‌కా‌నా‌యి‌కలు చైతూ, సమం‌తల ఆఫ్‌స్క్రీన్‌ కెమిస్ట్రీకి కూడా అంద‌మైన బీజం పడింది.‌ 2017 సంవ‌త్స‌రంలో గోవాలో రంగ‌రంగ వైభ‌వంగా జరి‌గిన వేడు‌కలో ఒక్క‌టైన ఈ ప్రేమి‌కుల జంటకు పెళ్లి తర్వాత వస్తున్న మొట్ట‌మొ‌దటి వాలెం‌టై‌న్స్‌డే ఇది కావడం విశేషం.‌ ‌‘ప్రేమ’‌ అనే రస‌రమ్య లోకం‌లోకి అడు‌గు‌పె‌ట్టిన జంటకి అంతా కొత్తగా మత్తుగా ఉంటుం‌దన్న విష‌యాన్ని ఓ ప్రేమి‌కు‌రా‌లిగా సమంత మరో‌సారి నిరూ‌పిం‌చింది.‌ ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్ట్రా‌గా‌మ్‌లాంటి వేది‌కల ద్వారా టాలీ‌వుడ్‌ యంగ్‌హీ‌రోతో ప్రేమలో పడ్డట్టు చిన్న చిన్న క్లూలిస్తూ మెయి‌న్‌స్ట్రీమ్‌ మీడియా అటె‌న్షన్‌ డ్రా చేసింది.‌ దాంతో, సమంత లవ్‌ చేసిన తెలుగు హీరో ఎవ్వరా? అనే ఆస‌క్తితో ఎల‌క్ట్రా‌నిక్‌ మీడి‌యాలో వచ్చిన వీడి‌యో‌లకు లెక్కే‌లేదు.‌ ఒక్క లవ్‌స్టోరీ మీడియా ప్రపం‌చాన్ని అలర్ట్‌ చేసిం‌దంటే అదంతా సమంత మాయా‌జా‌లమే.‌ డేటింగ్, ఎంగే‌జ్‌మెంట్, మ్యారేజ్‌.‌.‌.‌ ఇలా ఒక్కో అంకంలో అడు‌గు‌పె‌డుతూ సమంత ఫ్యాన్స్‌తో పంచు‌కున్న విశే‌షాలు ‌‘సమ్‌థింగ్‌ స్పెషల్‌’‌.‌ 2017 పొడ‌వునా అక్కి‌నేని ఇంటి వివా‌హ‌వే‌డుక గురించి వార్తా‌క‌థ‌నా‌లెన్నో వెల్లు‌వె‌త్తాయి.‌ అలా.‌.‌అలా పెళ్ల‌య్యే‌దాకా అమ్మడు చేసిన అల్ల‌రికి సామా‌జిక మాధ్య‌మమే ప్రధాన సాక్షి.‌

ఎవ‌ర్‌గ్రీన్‌ లవర్‌ నయ‌న‌తార
విజ‌య‌వం‌త‌మైన ప్రేమ‌క‌థలే కాదు.‌.‌.‌ విఫల ప్రేమలూ కోకొ‌ల్లలు.‌.‌.‌ మొదట్లో ఇష్ట‌పడి తర్వా‌త‌ర్వాత కష్ట‌పడి చిరా‌కులు, పరా‌కుల్తో విడి‌వడి.‌.‌.‌ అంత‌లోనే మరో ప్రేమ‌క‌థకు శ్రీకారం చుట్టి ప్రేమిం‌చ‌డం‌లోని ‌‘థ్రిల్‌’‌ ఎక్స్‌‌పీ‌రి‌యన్స్‌ చేస్తున్న నటి నయ‌న‌తార ఎవ‌ర్‌గ్రీన్‌ లవర్‌.‌ సిని‌మా‌ల్లోకి వచ్చిన తొలి‌నా‌ళ్లలో సహ‌చర నటుడు శింబుతో నడి‌పిన ప్రేమా‌యణం, అత‌డితో నెరి‌పిన సాన్ని‌హిత్యం ఇప్ప‌టికీ ఇంట‌ర్నె‌ట్‌లో కని‌పి‌స్తూనే ఉంటాయి.‌ కొన్నా‌ళ్లకు అభి‌ప్రా‌య‌భే‌దా‌లొచ్చి ఆ ఇద్దరూ విడి‌పో‌వడం.‌.‌.‌ శింబుతో స్క్రీన్‌ షేర్‌ చేసు‌కో‌వ‌డాన్ని నయ‌న‌తార నిరా‌క‌రిం‌చడం చక‌చకా జరి‌గి‌పో‌యాయి.‌ ఇక, కెరీ‌ర్‌పై పూర్తి దృష్టి అంటూ స్టేట్‌మెం‌టి‌చ్చిన కొద్ది‌రో‌జు‌లకే ప్రభు‌దే‌వాతో పీక‌ల్లోతూ ప్రేమలో పడి‌పో‌వడం మీడి‌యాలో ప్రము‌ఖంగా చోటు‌చే‌సు‌కుంది.‌ ఈ సారి ప్రభు‌దే‌వాతో కచ్చి‌తంగా పెళ్లి జరు‌గు‌తుం‌దంటూ నమ్మిన నయ‌న‌తార మతాన్ని కూడా మార్చు‌కో‌వ‌డం‌తో‌పాటు తెలు‌గులో ‌‘బాపు’‌ చిత్రం ‌‘శ్రీరా‌మ‌రాజ్యం’‌ చివరి చిత్రంగా ప్రక‌టిం‌చింది.‌ షూటింగ్‌ పూర్త‌యిన వెంటనే సిని‌మా‌రం‌గా‌నికి శాశ్వ‌తంగా వీడ్కోలు చెప్తు‌న్నా‌ననే భావంతో యూనిట్‌ సభ్యు‌లం‌ద‌రికీ చేతు‌లెత్తి నమ‌స్క‌రిస్తూ నయ‌న‌తార కన్నీరు పెట్టు‌కున్న సంగతి తెలి‌సిందే.‌ ఆ తర్వాత చక‌చకా జరి‌గిన మార్పుల్తో ప్రభు‌దే‌వాతో ప్రేమ విఫ‌లమై మళ్లీ వరుస సిని‌మాలు చేస్తూ అగ్రశ్రేణి తారగా మెయిన్‌ స్ట్రీమ్‌లోకి వచ్చే‌సింది.‌ ఈసారి కూడా కెరీ‌ర్‌పైనే దృష్టి అంటూ స్టేట్‌మెం‌టి‌చ్చిన నయన్‌ మరో‌సారి మళ్లీ కోలీ‌వుడ్‌ దర్శ‌కుడు విఘ్నే‌ష్‌తో ప్రేమలో పడింది.‌ ఈ ప్రేమ‌క‌థైనా ‌‘శుభం కార్డు’‌ పడా‌లని నయ‌న‌తార అభి‌మా‌నులు అభి‌ల‌షి‌స్తు‌న్నారు.‌


నటి అమ‌లా‌పా‌ల్‌ది విఫ‌ల‌ప్రేమే
నటి అమ‌లా‌పాల్‌ కూడా విజయ్‌ అనే దర్శ‌కు‌డిని ప్రేమించి పెళ్లి‌చే‌సు‌కున్న అన‌తి‌కా‌లం‌లోనే విడా‌కులు తీసు‌కుని మళ్లీ వరుస సిని‌మాల్తో హల్‌చల్‌ చేస్తున్న సంగతి తెలి‌సిందే.‌ పెళ్లి, వ్యక్తి‌గత జీవితం కన్నా అమ‌లా‌పా‌ల్‌కి సిని‌మాలు ఎక్కు‌వ‌య్యా‌యని.‌.‌.‌అందుకే, విడి‌పో‌యా‌మంటూ అత్తిం‌టి‌వారు మీడి‌యాకి చెప్పారు.‌ పెళ్లి తర్వాత జీవి‌తంలో స్వేచ్ఛ కోల్పో‌యా‌నని, తన ఆశలు, ఆకాం‌క్ష‌లను, అడ‌గ‌డు‌గునా అత్తింట్లో అవాం‌త‌రాలు ఎదు‌ర‌య్యా‌యని అమ‌లా‌పాల్‌ కథనం.‌ ఈ ఇద్దరూ తారలే కాదు, పెద్దలు నిర్ణ‌యిం‌చిన పెళ్లి పీట‌ల‌దాకా వచ్చిన తర్వాత కూడా రద్ద‌యిన కథ చెన్నయ్‌ చంద్రమ త్రిషది.‌ ప్రేమలో పడటం వేరు.‌.‌.‌ ఆ ప్రేమను కల‌కాలం నిల‌బె‌ట్టు‌కో‌వడం వేరని ఇలాంటి విఫల ప్రేమలు సోదా‌హ‌ర‌ణగా వివ‌రి‌స్తాయి.‌


ప్రేమించి పెళ్లి చేసు‌కుని తనిం‌టికి ఆహ్వా‌నిం‌చిన వ్యక్తిని నూరే‌ళ్ల‌పాటు సౌక‌ర్యంగా ఉండేలా చూసు‌కో‌వడం కూడా ఆర్ట్‌.‌ ఆ ఆర్ట్‌లో ఆరి‌తే‌రిన వారిలో బిగ్‌బి అమి‌తాబ్, అభి‌షేక్‌ బచ్చన్, కృష్ణ, రాజ‌శే‌ఖర్, శ్రీకాంత్, అక్కి‌నేని నాగా‌ర్జున, మహే‌ష్‌బాబు.‌.‌.‌ ఇలా ఎంతో‌మంది నిలు‌స్తారు.‌ ప్రేమలో గెలిచి నిలి‌చిన ప్రేమి‌కు‌లం‌ద‌రికీ ప్రతి‌రోజూ ‌‘వాలెం‌టైన్స్‌ డే’‌ కాదం‌టారా?

−‌ పి.‌వి.‌డి.‌ఎస్‌.‌ ప్రకాష్‌


© Sitara 2018.
Powered by WinRace Technologies.