ఆస్ట్రేలియా నుంచి హాలీవుడ్‌కి

క్రిస్‌ హెమ్స్‌వర్త్‌ అంటే పెద్దగా తెలియకపోవచ్చు. కానీ ‘స్టార్‌ట్రెక్‌’, ‘ద ఎవెంజర్స్‌’, ‘థార్‌’, ‘రష్‌’, ‘ఘోస్ట్‌బస్టర్స్‌’ చిత్రాల నటుడంటే ఇట్టే గుర్తుపడతారు. నాటకాలు, టీవీల ద్వారా నటుడైన ఇతడు మెల్‌బోర్న్‌లో 1983 ఆగస్టు 11న పుట్టి హాలీవుడ్‌లో యువతకు ఇష్టమైన నటుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఇతనికి ఎల్సా పతాకీ అనే నటితో పెళ్లైయింది. వీరికి ముగ్గురు సంతానం. ఈ సంవత్సరం విడుదలై ఘన విజయాన్ని నమోదు చేసుకున్న ‘అవెంజెర్స్‌: ఎండ్‌గేమ్‌’ చిత్రంలో థోర్‌ పాత్రలో నటించారు. ప్రస్తుతం ‘ఢాకా’, ‘జాయ్‌ అండ్‌ సైలెంట్‌ బాబ్‌ రిబూట్‌’ సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తున్నారు.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.