42 విడుదలలు... 300 కోట్ల డాలర్లు!

ఓ నటుడు నటించిన సినిమాలు ప్రపంచవ్యాప్తంగా 42 సార్లు విడుదల అయ్యాయి... ఆ సినిమాలన్నీ కలిసి 300 కోట్ల డాలర్లను వసూలు చేశాయి. అంతటి ప్రాచుర్యం పొందిన నటుడే కొలిన్‌ ఆండ్రూ ఫిర్త్‌. ఆస్కార్, గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డులతో పాటు రెండు బాఫ్తా అవార్డులు, మూడు స్కీన్ర్‌ యాక్టర్స్‌ గిల్డ్, వోల్పి కప్‌ అవార్డులు అందున్న ఉత్తమ నటుడు. ‘ద కింగ్స్‌ స్పీచ్‌’ సినిమాలో కింగ్‌ జార్జి-6గా నటించి ఆస్కార్‌ అందుకున్నాడు. 1960 సెప్టెంబర్‌ 10న పుట్టిన ఇతగాడు ‘ద ఇంగ్లిష్‌ పేషెంట్‌’, ‘బ్రిడ్జెట్‌ జోన్స్‌ డైరీ’, ‘షేక్స్‌పియర్‌ ఇన్‌ లవ్‌’, ‘లవ్‌ యాక్చువల్లీ’, ‘ఎ సింగిల్‌ మ్యాన్‌’ల ాంటి చిత్రాల ద్వారా అంతర్జాతీయ గుర్తింపు పొంది టైమ్స్‌ పత్రిక విడుదల చేసే వందమంది ప్రభావశీలుర జాబితాలో స్థానం పొందాడు. సినిమాలో నటించడం కోసం చాలా నేర్చుకున్నారు. ముందుగా లండన్‌లో నేషనల్‌ యూత్‌ థియేటర్లో చేరాడు. అక్కడ పరిచయాలను పెంచుకొని అందులోనే నేషనల్‌ థియేటర్‌ వార్దోబ్‌ విభాగంలో చిన్నగా ఉద్యోగం సంపాదించాడు. అంతేకాదు డ్రామా సెంటర్‌ లండన్‌లో చదువుకున్నారు. కోలిన్‌ ఆండ్రూ ఫిర్త్‌కి ఒక భార్య ముగ్గురు పిల్లలు ఉన్నారు.



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.