నటన విలక్షణం

‘లార్డ్‌ ఆఫ్‌ రింగ్స్‌’, ‘హోబిట్‌: ఎన్‌ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌ జర్నీ’ సినిమాలు చూసిన వారికి గుర్తుండిపోయే నటుడు ఎలిజా ఉడ్‌. ‘బ్యాక్‌ టుది ఫ్యూచర్‌2’ (1989) సినిమాతో వెండితెరకు బాలనటుడిగా పరిచయమైన ఎలిజా, ‘అవలాన్‌’, ‘ప్యారడైజ్‌’ లాంటి సినిమాలతో పేరు తెచ్చుకున్నాడు. యువకుడిగా ‘నార్త్‌ ద వార్‌’, ‘ఫ్లిప్పర్‌’, ‘ద ఐస్‌ స్టార్మ్‌’, ‘డీప్‌ ఇంపాక్ట్‌’, ‘ఎటర్నెల్‌ సన్‌షైన్‌ ఆఫ్‌ ద స్పాట్‌లెస్‌ మైండ్‌’, ‘సిన్‌ సిటీ’,‘ఐ డోన్ట్‌ ఫీల్‌ ఎట్‌హోమ్‌ ఇన్‌ దిస్‌ వరల్డ్‌ ఎనీమోర్‌’ లాంటి సినిమాలతో గుర్తుండిపోయాడు. అమెరికాలో 1981 జనవరి 28న పుట్టిన ఎలిజా ఏడేళ్లకే మోడల్‌గా మెరిసి నాటకాల్లోను, టీవీల్లోను విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్నాడు.



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.