ప్రధానికి ఉత్తరం రాశాడు
కన్హూకి తన తల్లంటే ఎంతో ప్రేమ. తన తల్లికి అందరి పిల్లల్లా ఏదో ఒక బహుమతి ఇవ్వాలనుకోలేదు. అమ్మ కోసం ఓ మరుగు దొడ్డి కానుకగా ఇవ్వాలనుకున్నాడు. కానీ అతడి వయసుకు అది కష్టం. అందుకే తన కోరిక నెరవేర్చుకోవడానికి దేశ ప్రధాని సాయం కోరుతూ లేఖ రాస్తాడు. ఆ తర్వాత ఏమైంది? అతడి కోరిక ఎలా నెరవేరింది? లాంటి విషయాలు తెరపైనే చూడాలంటున్నారు రాకేష్‌ ఓం ప్రకాష్‌ మెహ్రా. ఆయన దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘మేరే ప్యారే ప్రైమ్‌ మినిస్టర్‌’. ‘భాగ్‌ మిల్కా భాగ్‌’, ‘రంగ్‌ దే బసంతి’ తదితర చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించుకున్నారు రాకేష్‌. తాజాగా ఈ ‘మేరే ప్యారే..’కు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. బహిరంగ మల విసర్జన, పారిశుద్ధ్యం అంశాల్ని ఈ చిత్రంలో ప్రధానంగా చర్చించారు. ‘నా బంగారు తల్లి’ చిత్రంతో జాతీయ స్థాయి పురస్కారాన్ని గెలుచుకున్న అంజలి పాటిల్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. మాస్టర్‌ ఓం కనూజియా, మకరంద్‌ దేశ్‌పాండే కీలక పాత్రధారులు. ఈ నెల 10న ట్రైలర్‌ను విడుదల చేయనున్నారు. వచ్చే నెల 15న చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.