సహజీవనం గందరగోళం

గతేడాది ‘సోను కే టిటూ కీ స్వీటీ’తో ఘన విజయాన్ని అందుకున్నాడు కార్తిక్‌ ఆర్యన్‌. అతడు కథానాయకుడిగా నటించిన చిత్రం ‘లుకా చుప్పి’. కార్తిక్‌ సరసన కృతి సనన్‌ నాయికగా నటిస్తోంది. సహ జీవనం చేయాలనుకునే రష్మి, గుడ్డు అనే ఓ జంట.. వారితోనే కలసి ఉండాలనుకునే కుటుంబం.. ఈ నేపథ్యంలో వినోదాత్మకంగా ఈ చిత్రం తెరకెక్కింది. ఇటీవలే విడుదలైన ట్రైలర్‌ ఆకట్టుకుంటోంది. ఇందులోని ‘పోస్టర్‌ లగ్వా దో’ అనే పాటను విడుదల చేశారు. 1990ల నాటి థీమ్‌తో నాయకానాయికలకు, వారి కుటుంబ సభ్యులకు మధ్య జరిగే దాగుడుమూతలతో తెరకెక్కించిన ఈ పాట వినోదాలు పంచుతోంది. లక్ష్మణ్‌ ఉతేకర్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం వచ్చే నెల 1న విడుదలవుతోంది. ఇందులో కీలక పాత్రల్లో పంకజ్‌ త్రిపాఠి, వినయ్‌ పాఠక్‌, అపర్‌శక్తి ఖురానా నటించారు.



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.