ఇది ముసలమ్మల విజయగాథ

ఇప్పటివరకూ ఎంతో మంది క్రీడాకారుల జీవిత కథా చిత్రాలు తెరకెక్కాయి. అయితే అవన్నీ యుక్త వయసులో ఉన్న ఆటగాళ్లు సాధించిన విజయాలనే ఆవిష్కరించాయి. కానీ డెబ్బై ఏళ్ల ముసలమ్మల విజయగాథను కళ్లకు కట్టేలా ఓ చిత్రం వస్తోందంటే విశేషమే. అదే ‘సాండ్‌ ఖీ ఆంఖ్‌’. ప్రపంచంలోనే వయోవృద్ధులైన షూటర్లుగా గుర్తింపు తెచ్చుకున్న ప్రకాషి తోమర్, చంద్రో తోమర్‌ అనే మహిళల జీవితకథతో ఇది తెరకెక్కింది. ఏడు పదుల వయసులో వారు సాధించిన విజయాలను ఈ చిత్రంలో చూపించనున్నారు. ప్రకాషిగా తాప్సి, చంద్రోగా భూమి పెడ్నేకర్‌ నటించారు. తుషార్‌ హీరానందని తెరకెక్కించారు. తాజాగా విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌ ఆకట్టుకుంటోంది. హర్యానాలోని గ్రామీణ ప్రాంతానికి చెందిన మహిళలుగా తాప్సి, భూమిల ఆహార్యం, వారి హర్యానీ యాస మెప్పిస్తోంది. షూటింగ్‌ పోటీల్లో పాల్గొనేటప్పుడు వారికెదురైన వివక్ష, అవమానాలు, వాటికి దీటుగా వారు సాధించిన విజయాలు, స్త్రీల జీవితాల గురించి వారు చెప్పిన సంభాషణలు ఆలోచన రేకెక్తిస్తున్నాయి. ‘స్త్రీలు తమ వయసును దాచిపెట్టాలనుకోరు. కానీ వారి కోసం వారు బతికిన రోజులెన్నో వారికి గుర్తుండదు’ అన్న సంభాషణకు మంచి స్పందన వస్తోంది. దీపావళి కానుకగా అక్టోబరు 25న విడుదల చేస్తున్నారు.





Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.