ఆకట్టుకుంటున్న ‘మన్మర్జియాన్‌’ ట్రైలర్‌

‘పింక్‌’, ‘జుడ్వా 2’, ‘ముల్క్‌’ వంటి చిత్రాలతో నటిగా బాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకుంది తాప్సీ పన్ను. ఇటీవలే ‘ముల్క్‌’ చిత్రంతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఇప్పుడు ఓ సరికొత్త ప్రేమ కథ ‘మాన్మర్జియాన్‌’తో ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. అభిషేక్‌ బచ్చన్‌, కౌశల్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రమిది. అనురాగ్‌ కశ్యప్‌ దర్శకత్వంలో ఆనంద్‌ ఎల్‌.రాయ్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈరోస్‌ ఇంటర్నేషనల్‌ సంస్థ నిర్మాన భాగస్వామిగా వ్యవహరిస్తోంది. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోన్న ఈ చిత్రం సెప్టెంబర్‌ 14న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తాజాగా చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. యువతరాన్ని ఆకట్టుకునే ఓ ముక్కోణపు ప్రేమ కథతో ఈ చిత్రాన్ని రూపొందించారు. విక్కీ కౌశల్‌, తాప్సీలా ఘాటు అదర చుంబనాలతో ప్రారంభమైన ట్రైలర్‌.. ఆద్యంతం అదే రొమాంటిక్‌ ఫీల్‌ను కొనసాగించి, సినిమా ఏ స్థాయిలో ఉండబోతుందనేది చెప్పకనే చెప్పేసింది. తాప్సీ గత చిత్రాలకు భిన్నంగా. పూర్తి గ్లామర్‌ లుక్‌తో, అదరగొట్టే లిప్‌లాక్‌లతో ఆకట్టుకుంది. అభిషేక్‌ బచ్చన్‌, కౌశల్‌ పంజాబీ యువకుల్లా చక్కగా ఒదిగిపోయారు. మరి వీరిద్దరిలో ఎవరి ప్రేమను తాప్సీ దక్కించుకోబోతుంది తెలియాలంటే సెప్టెంబరు 14 వరకు వేచి చూడాల్సిందే.

                                      

 


 


© Sitara 2018.
Powered by WinRace Technologies.