‘టాయ్‌ స్టోరీ 4’లో బో పీస్‌

హాలీవుడ్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన యానిమేషన్‌ చిత్రాల్లో ‘టాయ్‌ స్టోరీ’ ఒకటి. ఈ సిరీస్‌లో వచ్చిన మూడు చిత్రాలూ ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందాయి. ఇప్పుడు నాలుగో చిత్రం అభిమానులను అలరించడానికి సిద్ధమవుతోంది. 2010లో వచ్చిన ‘టాయ్‌ స్టోరీ 3’ ఉత్తమ యానిమేషన్‌ చిత్రంగా ఆస్కార్‌ పురస్కారం అందుకుంది. పదేళ్ల విరామం తర్వాత ‘టాయ్‌ స్టోరీ 4’ రాబోతోంది. దీనికి సంబంధించి ఓ ఆసక్తికరమైన విషయం వెల్లడైంది. తొలి రెండు చిత్రాల్లో గుర్తుండిపోయిన బో పీప్‌ అనే బొమ్మ పాత్ర ఈ నాలుగో చిత్రంలోనూ కనిపించనుంది. ఆ పాత్ర ఫస్ట్‌లుక్‌ను చిత్రబృందం విడుదల చేసింది. జోష్‌ కూలే తెరకెక్కించిన ఈ చిత్రం ఈ ఏడాది జూన్‌లో విడుదల కాబోతోంది.



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.