మాయాదీవులలో ప్రయాణం...

ఎల్సా...నీ గతం గురించి తెలుసుకోవాలంటే ఉత్తరాది వైపునున్న మాయాదీవుల నుంచి ప్రయాణం చేయాలి అని మార్గనిర్దేశం చేశాడు ఓ గురువు. ఎవరి గతం గురించి వాళ్లకి తెలుస్తుంది కాని ఎల్సా జీవితంలో ఉన్న రహస్యాలు ఆమెకే తెలీవు. అవి తెలుసుకోవటానికి మాయాదీవుల నుంచి ప్రయాణం ఆరంభించాలి. ఆ ప్రయాణం సాఫీగా జరగటానకి తోడుగా ఒక స్నేహితురాలు కూడా, ఆ దారిలో ఉన్న అడ్డంకులు ఏన్నో కనపడుతున్నాయి. త్రీడి యానిమేషన్‌లో అద్భుత సాంకేతికత మాయాజాలంతో ఇలా నిండిపోయింది ‘ఫ్రోజెన్‌ 2’ ప్రచారచిత్రం. ఇందులోని చిన్నారి ఎల్సాకి మహేష్‌ కూతురు సితార గొంతు కలిపితే, పెద్ద అయిన తరువాత నిత్యమేనన్‌ గళం వినిపించటం మరో విశేషం. తాజాగా విడుదలైన ప్రచారచిత్రం చిన్నారులను, పెద్లలను అమితంగా ఆకట్టుకుంటుంది.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.