మానవాతీత శక్తులతో ‘గ్లాస్‌’

భారతీయ సంతతికి చెందిన హాలీవుడ్‌ దర్శకుడు మనోజ్‌ నైట్‌ శ్యామలన్‌ దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘గ్లాస్‌’. ఇది ఒక సూపర్‌ హీరో థ్రిల్లర్‌ చిత్రం. గతంలో మనోజ్‌ దర్శకత్వం వహించిన ‘అన్‌బ్రేక్‌బుల్‌’ చిత్రానికి సీక్వెల్‌ ఇది. ఇందులో ప్రముఖ నటులు జేమ్స్‌ మాక్వై, బ్రూస్‌ విలీస్, శ్యామ్యూల్‌ ఎల్‌.జాక్సన్‌ తదితరులు నటిస్తున్నారు. ఇరవై మూడు రకాల మనస్తత్వాలను కలిగి ఉండే వ్యక్తి కథగా ఇది ఉంటుంది. ఆ వ్యక్తి ఒక్కోసారి ఒక్కోలా ప్రవర్తిస్తుంటాడు. అతని శరీరంలో ఏదో తెలియని జీవరసాయన పక్రియ జరుగుతుంది. ఆ సమయంలో అతను ఏం చేస్తాడో తెలియదు. తన చుట్టూ ఉన్నవారిని భయపెడుతూ గందరగోళానికి గురి చేసి చంపేస్తుంటాడు. ఈ పాత్రలో జేమ్స్‌ నటిస్తున్నారా. ఫుట్‌బాల్‌ ఆటగాడి పాత్రలో బ్రూస్‌ విలీస్‌ కనిపిస్తారు. శ్యామ్యూల్‌ ఎల్‌ జాక్సన్‌ మానవాతీత శక్తులు కలిగిన వ్యక్తిగా కనిపిస్తారు. వైవిధ్య పాత్రలతో వస్తున్న ఈ సూపర్‌హీరో థ్రిల్లర్‌ చిత్రం జనవరి 18న విడుదల కానుంది.© Sitara 2018.
Powered by WinRace Technologies.