గ్యాంగ్‌స్టర్‌ వస్తున్నాడు!

శర్వానంద్‌ కథానాయకుడిగా సితార ఎంటర్‌ టైన్‌మెంట్స్‌ తెరకెక్కించిన చిత్రం ‘రణరంగం’. కాజల్‌, కల్యాణి ప్రియదర్శన్‌ కథానాయికలు. సుధీర్‌వర్మ దర్శకత్వం వహించారు. సూర్య దేవర నాగవంశీ నిర్మాత. సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ నెల 15న విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ ‘‘సరికొత్త గ్యాంగ్‌స్టర్‌ చిత్రమిది. భిన్నమైన కథ, కథనాలుంటాయి. గ్యాంగ్‌స్టర్‌ జీవితంలో 1990లోనూ, వర్తమానంలోనూ జరిగిన సంఘటనల సమాహారంగా సుధీర్‌వర్మ చిత్రాన్ని తెరకెక్కించారు. శర్వానంద్‌ నటనతోపాటు ఆయన పండించిన భావోద్వేగాలు, కాజల్‌, కల్యాణి ప్రియదర్శన్‌ల పాత్రలు ఆకట్టుకుంటాయి. ఇటీవల విడుదలైన ట్రైలర్‌కి మంచి స్పందన లభించింది. చిత్రం కూడా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరిస్తుంది’’ అన్నారు. ఈ సినిమాకి మాటలు: అర్జున్‌ - కార్తీక్‌, సంగీతం: ప్రశాంత్‌ పిళ్లై, ఛాయాగ్రహణం: దివాకర్‌ మణి.

 


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.